అల్లు అరవింద్ పుత్రోత్సాహం

రాష్ట్రపతి భవన్.. 69వ జాతీయ ఫిలిం అవార్డుల వేదిక.. స్టేజ్ పై రాష్ట్రపతి, అల్లు అర్జున్. ఆమె చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీ. స్టేజ్ కింద కళ్లార్పకుండా చూస్తున్న అల్లు అరవింద్.…

రాష్ట్రపతి భవన్.. 69వ జాతీయ ఫిలిం అవార్డుల వేదిక.. స్టేజ్ పై రాష్ట్రపతి, అల్లు అర్జున్. ఆమె చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీ. స్టేజ్ కింద కళ్లార్పకుండా చూస్తున్న అల్లు అరవింద్.

కొడుకు సాధించిన ఘనతను కళ్లారా చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఆ తండ్రి. తనకు అంతకంటే ఇంకేం కావాలంటున్నారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఈ మెగా ప్రొడ్యూసర్.. కొడుకు విజయాల్ని కళ్లారా చూడడం తన అదృష్టం అంటూ స్పందించారు.

పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు బన్నీ. దానికి సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు జరిగింది. దీని కోసం కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లిన బన్నీ, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించాడు.

ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ (పుష్ప 2- ది రూల్) తీసే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్. జాతీయ అవార్డ్ తనకు మరింత బాధ్యతను పెంచిందంటున్న బన్నీ.. పుష్ప-2లో పాన్ ఇండియా లెవెల్లో మరోసారి సక్సెస్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది పుష్ప-2.