టీడీపీ బాలయ్య కోసం వైకాపా ‘కోన’

బాలయ్య-బాబీ కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది. 1980-1990 బ్యాక్ డ్రాప్ కథ ఇది. ముందు సాఫ్ట్ గా కనిపించే బాలయ్య, తీరా చూసి ఫ్లాష్ బ్యాక్ చూస్తే రౌద్రంగా వుండే బాలయ్య. ఈ…

బాలయ్య-బాబీ కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది. 1980-1990 బ్యాక్ డ్రాప్ కథ ఇది. ముందు సాఫ్ట్ గా కనిపించే బాలయ్య, తీరా చూసి ఫ్లాష్ బ్యాక్ చూస్తే రౌద్రంగా వుండే బాలయ్య. ఈ పదేళ్ల మధ్య కథ తిరుగుతుంటుందని టాక్. 

ఈ కథను అందిస్తున్నది కోన వెంకట్. ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వున్న బంధాలు జగద్విదితం. అయితే బాలయ్య కోసం, రాబోయే ఎన్నికలను దృష్టిలో వుంచుకుని కొన్ని పొలిటికల్ డైలాగులు జోడిస్తున్నారని, అందుకోసం పొలిటికల్ సీన్లు రాస్తున్నారని అప్పుడే వార్తలు గుప్పు మన్నాయి.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, ఈసారి బాలయ్యతో బాబీ చేసే సినిమా కాస్త క్లాస్ టచ్ తో వుంటుంది. మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాను ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య టైపు ఎమోషన్, మాస్ యాక్షన్ అన్నీ వుంటాయి. కానీ అన్నింటిలో కాస్త క్లాస్ టచ్ వుండేలా చూస్తున్నారు. ఆ విధంగా ఓవర్ సీస్ లోని క్లాస్ ఆడియన్స్ కూడా బాలయ్య మీద అభిమానంతో కాకుండా, సినిమా మీద అభిమానంతో చూసేలా ప్లాన్ చేస్తున్నారు.

మరి ఇలాంటపుడు ఈ పొలిటికల్ పొలికేకలు..రాజకీయ సన్నివేశాలు ఎంత వరకు ఇముడుతాయో చూడాలి. ఎంత ఎన్నికల ముందు సినిమా వస్తున్నా, రాజకీయాలు చొప్పిస్తే రంజుగా వుండడం మాట అలా వుంచి ఓ వర్గానికి పరిమితం అయిపోయే ప్రమాదం వుంది. 

పైగా వైకాపా జనాల నుంచి కోన టార్గెట్ అయ్యే అవకాశమూ వుంది. అక్టోబర్ తరువాత ప్రారంభం అయ్యే సినిమా ఇది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. అందువల్ల ఈ లోగా ఎన్ని మార్పులు చేర్పులు వుంటాయో చూడాలి.