అవును. రాష్ట్రంలోనే తొలిసారి విశాఖపట్నంలో స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని షురూ చేస్తున్నారు. మహా విశాఖ నాగర పాలక సంస్థలో వీటిని శరవేగంగా ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం రెడీ అయింది.
ఏపీలో ప్రయోగాత్మకనగా వంద చోట్ల స్మార్ట్ మీటర్లను విశాఖలో నెలకొల్పుతున్నారు. విశాఖలోని సర్వే కార్యాలయం జోన్ పరిధిలో 85 సింగిల్ ఫేజ్, అయిదు త్రీ ఫేజ్ కనెక్షన్లకు వీటిని అమర్చుతున్నారు.
వీటి ఏర్పాటు మీద ఈపీడీసీఎల్ ఆఫీస్ కూడా తాజాగా భేటీ అయి కీలకమైన సలహాలు సూచనలు ఇచ్చింది. విశాఖలో స్మార్ట్ మీటర్ల కార్యక్రమం విజయవంతం అయితే ఏపీలో మిగిలిన చోట్ల అమలు చేస్తారు
మొత్తానికి స్మార్ట్ సిటీలో స్మార్ట్ మీటర్లు అన్న మాట. దీని వల్ల అటు వినియోగదారునికీ, ఇటు విద్యుత్ సంస్థకు కూడా ఉపయోగకరమే అని అంటున్నారు.