నటుడు ప్రశాంత్ మరోసారి వార్తల్లోకెక్కాడు. 90ల్లో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న ఈ నటుడు 48 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైనట్టు కోలీవుడ్ నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ప్రశాంత్, తన ఒంటరితనానికి చెక్ పెట్టి, ఓ ఇంటివాడు అవుతాడంట.
2005లో గ్రహలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు ప్రశాంత్. ఆ మరుసటి ఏడాదే వాళ్లకు బాబు పుట్టాడు. అయితే వాళ్ల వైవాహిక జీవితం అనుకున్నంత సాఫీగా సాగలేదు. పెళ్లయిన మూడేళ్లకే ప్రశాంత్-గ్రహలక్ష్మి విడిపోయారు. అలా పుష్కర కాలంగా ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్.. ఓ దశలో సినిమాలకు కూడా దూరమయ్యాడు.
2019లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు, అదే టైమ్ లో కోలీవుడ్ లో కూడా నటుడిగా నిరూపించుకునే ప్రయత్నాల్లో పడ్డాడు. ప్రస్తుతం అంధాధూన్ సినిమా తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు.
కొన్నాళ్లుగా తన ఫ్యామిలీ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటున్నాడట ప్రశాంత్. అంధాధూన్ తమిళ రీమేక్ రిలీజైన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాడనే టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రశాంత్ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటన వస్తుందంటున్నారు.