మన జాతినైనా పిలవలేకపోయారా..? బాబు ఏడుపు!

ఉక్రెయిన్ లో యుద్ధ భయంతో ఉన్న విద్యార్థులను ఓ దశలో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓదార్చారు. అప్పట్లో బాబుకి అందరూ ధన్యవాదాలు చెబుతున్న వీడియోలు చాలానే బయటకొచ్చాయి. చంద్రబాబు కూడా ఉక్రెయిన్ కామెడీని…

ఉక్రెయిన్ లో యుద్ధ భయంతో ఉన్న విద్యార్థులను ఓ దశలో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓదార్చారు. అప్పట్లో బాబుకి అందరూ ధన్యవాదాలు చెబుతున్న వీడియోలు చాలానే బయటకొచ్చాయి. చంద్రబాబు కూడా ఉక్రెయిన్ కామెడీని బాగానే పండించారు. సంక్షోభంలో ఉన్న విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ బెస్ట్ విషెస్ కూడా తెలిపారు. ఇంత కామెడీ చేసినా వారు తిరిగొచ్చాక  బాబుని కలవలేదు. నేరుగా వెళ్లి సీఎం జగన్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. దీంతో బాబుకి తిక్కరేగింది. ఏడుపు మొదలైంది.

ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు సహాయక చర్యల కోసం మంత్రులు, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. బాబు మాత్రం నిమిషాల్లో జూమ్ ముందు వాలిపోయారు. అక్కడి విద్యార్థులతో జూమ్ కాల్ లో మాట్లాడేసి, ధైర్య వచనాలు చెప్పి ఏదో చేసేసినట్టు బిల్డప్ ఇచ్చుకున్నారు. జగన్ పట్టించుకోలేదని, అధికారం లేకపోయినా తను పట్టించుకున్నాననే ఇమేజ్ కోసం ట్రై చేశారు. కానీ వాస్తవానికి ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయి. 

ఏపీ నుంచి లిస్ట్ ఇవ్వడం, వారు ఎక్కడెక్కడున్నారో ఫాలోఅప్ చేసుకోవడం, అందర్నీ ఒకచోటకు చేర్చి, కేంద్రం పంపించిన విమానాల్లో ఇక్కడికి తీసుకురావడం.. ఢిల్లీ, ముంబైకి వచ్చాక అక్కడినుంచి స్వస్థలాలకు చేర్చడం.. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం పూర్తి చేశారు ఏపీ అధికారులు. ఇక్కడ చంద్రబాబు గొప్పతనం ఏముంది. కానీ ఆయనకి ఈ క్రెడిట్ లో వాటా కావాలంట.

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు చంద్రబాబుని కలవకపోవడం ఒక ఏడుపైతే.. జగన్ ని కలిసి ఆయనకు చిత్ర పటం బహూకరించడం, మరికొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం మరింత కడుపుమంటని కలిగిస్తోంది. సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పినట్టు ఇవి జెలుసిల్, ఈనో ప్యాకెట్లతో తగ్గేవి కావు. అంతకు మించిన డోస్ పడాలి. అందుకే బాబు కనీసం మన కులపోళ్లనయినా పిలవండి, నన్ను కలిసేలా చేయండి అంటూ నేతల్ని ఆదేశించారట. అలా విద్యార్థుల్లో కూడా కులాల్ని చూస్తూ, నీఛ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నారు బాబు.

ఉక్రెయిన్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు బాబు. ఇప్పుడది చాలదన్నట్టు.. నేరుగా వారితో సమావేశం అయి మరిన్ని జ్ఞాన గుళికలు విసురుతారేమో చూడాలి. విద్యార్థులంతా లోకేష్ ను చూసి నేర్చుకోవాలని, లోకేష్ అంత ఎత్తుకు ఎదగాలని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.