టాలీవుడ్ లో వేసవి శెలవులు తీసుకునే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు మాత్రమే. సినిమాలతో పాటు తన కుటుంబానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే మహేష్.. ప్రతి సమ్మర్ హాలిడేస్ కు పిల్లల్ని తీసుకొని విదేశాలకు వెళ్తుంటాడు. ఈసారి కూడా మహేష్ ప్రొగ్రామ్ ఫిక్స్ అయింది.
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇది పూర్తవ్వగానే త్రివిక్రమ్ తో కలిసి అతడు సెట్స్ పైకి వెళ్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ మహేష్ మాత్రం గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఎండలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇలాంటి వేడి వాతావరణంలో షూటింగ్ చేయడానికి మహేష్ ఇష్టపడడు. పైగా పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి. అందుకే త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాను మరికొన్నాళ్లు వాయిదా వేస్తున్నాడు మహేష్.
తాజా సమాచారం ప్రకారం.. జూన్ లేదా జులైలో మహేష్ కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేలా ఉంది. సో.. త్రివిక్రమ్ కు ఇంకొన్ని నెలలు వెయిటింగ్ తప్పదన్నమాట. ఈలోగా అతడు పవన్ నటించబోయే మరో సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూర్తిచేసుకోవచ్చు.
తన ఆస్థాన హీరోయిన్ పూజాహెగ్డేను, ఆస్థాన సంగీత దర్శకుడు తమన్ ను.. మహేష్ మూవీ కోసం కూడా రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. తమన్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే.