ఆర్ఆర్ఆర్…డిస్కౌంట్ డిమాండ్

ఆంధ్రలో రేట్లు తక్కువ వున్నపుడు, పరిస్థితులు బాగా లేనపుడు ఆర్ఆర్ఆర్ బయ్యర్లు థియేటర్ హక్కుల రేట్లు తగ్గించమని డిమాండ్ చేసారు. ఓ దశలో ఇరవై శాతం తగ్గిస్తారని వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితుల…

ఆంధ్రలో రేట్లు తక్కువ వున్నపుడు, పరిస్థితులు బాగా లేనపుడు ఆర్ఆర్ఆర్ బయ్యర్లు థియేటర్ హక్కుల రేట్లు తగ్గించమని డిమాండ్ చేసారు. ఓ దశలో ఇరవై శాతం తగ్గిస్తారని వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితుల మారాయి. టికెట్ రేట్లు పెరిగాయి. పైగా 75 రూపాయలు అదనపు రేటు వచ్చింది. 

ఇది చాలక ప్రభుత్వ చూసీ చూడనట్లు వదిలేయడంతో మొదటి రోజు తొలి ఆట రేట్లు రకరకాలుగా వినిపిస్తున్నాయి. మూడు వందల నుంచి అయిద వందల వరకు ఈ రేట్లు వినిపిస్తున్నాయి. పైగా బెనిఫిట్ షో ల రేట్లు కళ్లు తిరిగేలా వున్నాయి. 

నైజాంలో పరిస్థితి అంతకన్నా ఎక్కువ వుంది. బెనిఫిట్ షో లను మాంచి రేట్లకు అమ్మేసారు. టికెట్ మూడు వేల నుంచి అయిదు వేలు పలుకుతోంది. 

ఇలాంటి నేపథ్యంలో కూడా 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని బయ్యర్లు డిమాండ్ చేస్తుండడం విశేషం. కరోనా వడ్డీల భారం బాగా పడిందని, రిస్క్ ఎక్కువగా వుందని చెబుతూ డిస్కౌంట్ డిమాండ్ చేస్తున్నారు. దీని మీద డిస్కషన్లు సాగుతున్నాయి.

పదిశాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడానికి నిర్మాత దానయ్య వైపు నుంచి సుముఖత వ్యక్తం అయిందని తెలుస్తోంది. కానీ ముఫై శాతం తగ్గించాల్సిందే అని బయ్యర్లు పట్టుపడుతున్నారు. మరో మూడు రోజులు టైమ్ వుంది. ఈ లోగా ఎక్కడ సెటిల్ అవుతుందో చూడాలి.