సినిమా టాక్ నిల్.. కలెక్షన్లు ఫుల్

సినిమాపై బజ్ బాగా ఉండి, క్రేజ్ కలిసొస్తే ఇదే ఉపయోగం. మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల విషయంలో బెంగ ఉండదు. మాస్టర్ మూవీ విషయంలో ఇదే జరిగింది. విజయ్ హీరోగా నటించిన…

సినిమాపై బజ్ బాగా ఉండి, క్రేజ్ కలిసొస్తే ఇదే ఉపయోగం. మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల విషయంలో బెంగ ఉండదు. మాస్టర్ మూవీ విషయంలో ఇదే జరిగింది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ పడ్డాయి. దాదాపు క్రిటిక్స్ అందరూ సినిమా బాగాలేదని తేల్చేశారు. అయినప్పటికీ మొదటి రోజు మాస్టర్ మెరిశాడు.

తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ సినిమాకు ఏకంగా 5 కోట్ల 74 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న క్రాక్ సినిమాను సైతం తప్పించి, ఈ సినిమాను ప్రదర్శించినందుకు మంచి రాబడినే దక్కించుకున్నారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.

అయితే ఇవాళ్టి నుంచి ఈ సినిమా డౌన్ అయ్యే అవకాశాలున్నాయి. ఓవైపు నెగెటివ్ టాక్ రావడంతో పాటు, మరోవైపు ఈరోజు ఒకేసారి 2 సినిమాలు (అల్లుడు అదుర్స్, రెడ్) రిలీజ్ అవ్వడంతో.. ఆ మేరకు మాస్టర్ సినిమాకు థియేటర్లతో పాటు వసూళ్లు కూడా తగ్గిపోతాయి. అయితే అది మొదటి రోజే 80 శాతం రికవరీ సాధించడం ఊరటనిచ్చే అంశం..

మొదటి రోజు మాస్టర్ వసూళ్లు ఇలా.. (షేర్)
నైజాం – 1.49 కోట్లు
సీడెడ్ – 1.1 కోట్లు
ఉత్తరాంధ్ర – 83 లక్షలు
వెస్ట్ – 56 లక్షలు
ఈస్ట్ – 48 లక్షలు
గుంటూరు – 67 లక్షలు
కృష్ణా – 36 లక్షలు
నెల్లూరు – 25 లక్షలు
ఏపీ, నైజాం మొదటి రోజు షేర్ – 5.74 కోట్లు

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

ఈ సంక్రాంతి అల్లుడు నేనే