సినిమాపై బజ్ బాగా ఉండి, క్రేజ్ కలిసొస్తే ఇదే ఉపయోగం. మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల విషయంలో బెంగ ఉండదు. మాస్టర్ మూవీ విషయంలో ఇదే జరిగింది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ పడ్డాయి. దాదాపు క్రిటిక్స్ అందరూ సినిమా బాగాలేదని తేల్చేశారు. అయినప్పటికీ మొదటి రోజు మాస్టర్ మెరిశాడు.
తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ సినిమాకు ఏకంగా 5 కోట్ల 74 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న క్రాక్ సినిమాను సైతం తప్పించి, ఈ సినిమాను ప్రదర్శించినందుకు మంచి రాబడినే దక్కించుకున్నారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.
అయితే ఇవాళ్టి నుంచి ఈ సినిమా డౌన్ అయ్యే అవకాశాలున్నాయి. ఓవైపు నెగెటివ్ టాక్ రావడంతో పాటు, మరోవైపు ఈరోజు ఒకేసారి 2 సినిమాలు (అల్లుడు అదుర్స్, రెడ్) రిలీజ్ అవ్వడంతో.. ఆ మేరకు మాస్టర్ సినిమాకు థియేటర్లతో పాటు వసూళ్లు కూడా తగ్గిపోతాయి. అయితే అది మొదటి రోజే 80 శాతం రికవరీ సాధించడం ఊరటనిచ్చే అంశం..
మొదటి రోజు మాస్టర్ వసూళ్లు ఇలా.. (షేర్)
నైజాం – 1.49 కోట్లు
సీడెడ్ – 1.1 కోట్లు
ఉత్తరాంధ్ర – 83 లక్షలు
వెస్ట్ – 56 లక్షలు
ఈస్ట్ – 48 లక్షలు
గుంటూరు – 67 లక్షలు
కృష్ణా – 36 లక్షలు
నెల్లూరు – 25 లక్షలు
ఏపీ, నైజాం మొదటి రోజు షేర్ – 5.74 కోట్లు