సోషల్ మీడియాలో హీరోయిన్ సమంతకు అనుకూల, ప్రతికూల బ్యాచ్ లు రెండూ ఎప్పుడూ వుంటాయి. అవకాశం దొరికినపుడల్లా ఈ యాంటీ బ్యాచ్ ఓ లెక్కలో ట్రోల్ చేస్తూనే వుంటుంది.
కానీ శాకుంతలం ప్రచారం టైమ్ లో అనుకూల టీమ్ కు చాన్స్ వచ్చింది. సమంతకు మంచి సింపతీని జనరేట్ చేసింది. కానీ ఆ తరువాత నుంచి యాంటీ బ్యాచ్ కు సమంతనే స్వయంగా అవకాశం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
శాకుంతలం ప్రచారం టైమ్ లో చాలా బాధల్లో వున్నట్లు కనిపించిన సమంత, ఆ వెంటనే ముంబాయిలో వాలగానే రూపు రేఖలు అన్నీ మారిపోయి కనిపించింది. అప్పుడే జనం అవాక్కయ్యారు. నిన్నటికి నిన్న చేతిలో ‘బాటిల్’ పట్టుకుని విదేశాల్లో పార్టీ మూడ్ లో ‘ఊ అంటావా..మామా ఊక్కూ అంటావా’ అంటూ డ్యాన్స్ చేస్తున్న సమంత వీడియో ను చూసి మరోసారి అవాక్కయ్యారు.
మళ్లీ ఇక్కడకు ప్రమోషన్ కు వస్తేనే సమంతకు అనారోగ్యం, బాధలు వుంటాయేమో అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఖుషీ సినిమా ప్రమోషన్ కు తప్ప ఇప్పట్లో సమంత ఇక్కడకు వచ్చే అవకాశం అయితే లేదు. అంత వరకు ఈ సోషల్ మీడియాలోనే సమంత అయినా, ఆమె ట్రోలర్స్ అయినా కనిపించేది.