నిర్మాత, టాలీవుడ్ ఏస్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా..ఇంకా బోలెడు ప్రొఫైల్ వున్న దిల్ రాజు ఇంట త్వరలో సంబరాలు జరగబొతున్నాయని తెలుస్తోంది. భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో దిల్ రాజు ద్వితీయ వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం ఆ సతీమణి ద్వారా మరోసారి దిల్ రాజు తండ్రి కాబోతున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో బలంగా చక్కర్లు కొడుతున్నాయి.
దిల్ రాజుకు ఒక కుమార్తె మాత్రమే వున్నారు. వంశోద్దారకుడు, వారసుడు లేరు. ఇప్పుడు ఈ వార్తతో ఆ లోటు తీరుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దిల్ రాజు పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో, అలాగే పలు భారీ సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో బిజీగా వున్నారు.