డైరక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ప్రోజెక్ట్ కె. రాధేశ్యామ్ తో దారుణ ఫెయిల్యూర్ చవి చూసిన ప్రభాస్ హీరో. దీనికన్నా ముందు రామాయణం ఆధారంగా చేస్తున్న ఆదిపురుష్ వుంది. అలాగే సలార్ రెండు భాగాలు వున్నాయి.
సుమారు అయిదు వందల కోట్లతో తీస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా సోషియో ఫాంటసీ అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చేసాయి.
ఇప్పుడు కొత్తగా ఇది పురాణాలను, టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ చేస్తున్న మైథలాజికల్ ఫాంటసీ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూంది. విష్ణుమూర్తి కల్కి అవతారం కథ, అలాగే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్ధామ పాత్రలను బేస్ చేసుకుని ఈ కథ సాగుతుందట.
అశ్వద్ధామ చిరంజీవి. మరణం లేనివాడు. ఆ పాత్రలోనే అమితాబ్ కనిపిస్తారని సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూంది. అంటే అశ్వద్దామ పాత్రలో అమితాబ్…కల్కి పాత్రలో ప్రభాస్ అన్నమాట. మొత్తానికి ఏదో చేస్తున్నారు నాగ్ అశ్విన్.