త్రివిక్రమ్-దేవీ..ప్యాచప్ అయినట్లేనా?

జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ వున్నాయి త్రివిక్రమ్-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ లో. అలాంటిది ఓ చిన్న విషయం కారణంగా ఇరు వైపుల నుంచి దూరం పెరిగింది.  Advertisement ఓ సినిమాకు పోస్ట్…

జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ వున్నాయి త్రివిక్రమ్-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ లో. అలాంటిది ఓ చిన్న విషయం కారణంగా ఇరు వైపుల నుంచి దూరం పెరిగింది. 

ఓ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పని మీద చెన్నయ్ వెళ్లిన త్రివిక్రమ్ ను విపరీతంగా వెయింటింగ్ లో పెట్టారు దేవీ. దాంతో హర్ట్ అయ్యారు త్రివిక్రమ్. ఇదీ వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం అన్నది టాక్. ఏమైతేనేం ఇది థమన్ కు అద్భుతంగా కలిసి వచ్చింది. కేవలం త్రివిక్రమ్ సినిమాలు మాత్రమే కాకుండా, ఆయనతో లింక్ వున్న ప్రతి సినిమా థమన్ చేతిలోకి వచ్చింది.

ధమన్ ను త్రివిక్రమ్ పూర్తిగా తన మనిషిగా తీసుకున్నారు. మహేష్ బాబు కు అంతగా ఇష్టం లేకపోయినా ఒప్పించి మరీ గుంటూరు కారం సినిమాకు పని చేయిస్తున్నారు. అలాంటి బంధం ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య వుంది.

అయితే బాబీ-బాలకృష్ణ సినిమాకు మాత్రం థమన్ పని చేయడం లేదనే అనుమానాలు వినిపిస్తున్నాయి. బాబీ-దేవీ కలిసి ఇటీవల పెద్ద హిట్ కొట్టారు. అందువల్ల మళ్లీ అదే కాంబినేషన్ బాలకృష్ణ సినిమాకు రిపీట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే త్రివిక్రమ్-దేవీ మధ్య నెలకొన్న ఆ చిన్న ‘ఇగో క్లాష్’ ముగిసిపోయినట్లే అనుకోవాలి.

ఎందుకంటే బాలయ్య-బాబీ సినిమాకు నిర్మాతల్లో త్రివిక్రమ్ కూడా ఒకరు. ఆయన ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్ కూడా భాగస్వామ్యంలో వుంది. త్రివిక్రమ్ అనుమతి లేకుండా అక్కడ ఏమీ జరగదు. దేవీని ఫిక్స్ చేసారు అంటే ఇక భవిష్యత్ లో త్రివిక్రమ్-దేవీ కాంబినేషన్ కూడా మరోసారి తెరపైకి రావచ్చు. అప్పుడు మళ్లీ మరోసారి ‘కరో కరో జల్సా’ ‘ఆరడుగుల బుల్లెట్’ లాంటి సూపర్ హిట్ లు వినవచ్చు.