ఒత్తిడి ఉండదు.. జాగ్రత్త మాత్రమే ఉంటుంది: మహేష్

ఫ్లాప్ వచ్చినప్పుడు తనపై ఒత్తిడి ఉండదంటున్నాడు మహేష్. తదుపరి చేయబోయే సినిమాపై మరింత జాగ్రత్తగా మాత్రం ఉంటానని అంటున్నాడు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తండ్రి కృష్ణ నుంచి నేర్చుకున్నానని చెబుతున్నాడు. Advertisement “సక్సెస్ వచ్చినప్పుడు…

ఫ్లాప్ వచ్చినప్పుడు తనపై ఒత్తిడి ఉండదంటున్నాడు మహేష్. తదుపరి చేయబోయే సినిమాపై మరింత జాగ్రత్తగా మాత్రం ఉంటానని అంటున్నాడు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తండ్రి కృష్ణ నుంచి నేర్చుకున్నానని చెబుతున్నాడు.

“సక్సెస్ వచ్చినప్పుడు ఆనందం కంటే, ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతాను. మరింత కష్టపడాలనుకుంటాను. ఫ్లాపుల వల్ల నేను ఎలాంటి ఒత్తిడిని అనుభవించనప్పటికీ, ప్రేక్షకులు నా నుంచి ఎక్కువ ఆశిస్తున్నందున, నా చిత్రాల ఎంపికలో నేను మరింత జాగ్రత్తగా ఉన్నాను.”

తన కోసం థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్తదనం చూపించడం తన బాధ్యత అంటున్నాడు మహేష్. ఫిజిక్ లో మార్పు మాత్రమే కాదు, హెయిర్ స్టయిల్ లో చిన్న మార్పు కూడా కొత్తదనాన్నిస్తుందని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఫ్లాప్ వచ్చినప్పుడు బాగా కుంగిపోయిన ఫీలింగ్ వస్తుందని చెబుతున్నాడు.

“సినిమా బాగా ఆడనప్పుడు, కుంగిపోయిన ఫీలింగ్ ఉంటుంది. చాలా అంచనాలు ఉంటాయి, చాలా మంది చాలా కష్టపడి సినిమా తీస్తారు. అయితే, ఆ సినిమా కార్యరూపం దాల్చడానికి నేను కారణం కాబట్టి, ఫ్లాప్ అయితే పూర్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఎందుకంటే, నేను ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వకపోతే, అసలు ఆ సినిమా వచ్చి ఉండేది కాదు కదా. నేను అది నమ్ముతాను. అలా చేయడమే బెటర్. దాని వల్ల నా నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టడానికి వీలవుతుంది.”

ప్రస్తుతం ఈ హీరో త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరుకారం సినిమా చేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.