సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి, ముఖ్యంగా పచ్చ బ్యాచ్ కి, ఆ పచ్చబ్యాచ్ ని కౌంటర్ చేసే బ్యాచ్ కి ఇప్పుడు మూడు కొత్త పదాలు రిపీటెడ్ గా కనిపిస్తున్నాయి. లవ్ దిస్, ఆసమ్, గ్రేట్.. ఈ మూడు పదాలు టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో కనిపిస్తున్నాయి.
స్పేస్ ఎక్స్ పెట్టిన పోస్టింగ్ కి రిప్లైలు ఇస్తున్నట్టుగా లవ్ దిస్, ఆసమ్, గ్రేట్.. అంటూ టీడీపీ అఫీషియల్ అకౌంట్ నుంచి రిప్లైలు వెళ్లాయి. ఈ హ్యాకింగ్ వ్యవహారంతో ఎవరికీ ఎలాంటి నష్టం లేదు కానీ, టీడీపీ వేసే కడుపు మంట పోస్ట్ లనుంచి కొద్దిసేపయినా రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించినట్టయింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది.
పేలిపోతున్న సెటైర్లు..
టెక్నాలజీ పితామహుడు చంద్రబాబుకి చెందిన టీడీపీ అకౌంట్ హ్యాక్ అయిందొహో.. అంటూ సోషల్ మీడియాలో ఒకటే మీమ్స్. నారా లోకేష్ రాత్రి ఫుల్లుగా మందేసి ట్విట్టర్ లో రచ్చరచ్చ చేశారంటూ వైరి వర్గం జోకులందుకుంది.
ఒకటి కాదు, రెండు కాదు.. రకరకాలుగా టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిన విషయంపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. అయితే అసభ్యకరమైన పదాలు కానీ, ఫొటోలు కానీ లేకపోవడం ఒక్కటే టీడీపీకి కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే పోయి పోయి ఈ టైమ్ లో టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ని ఎవరు హ్యాక్ చేశారా అనేదే ఇప్పుడు అర్థంకాని అంశం.
అంతా అయిపోయాక చినబాబు..
అంతా అయిపోయాక చినబాబు తీరిగ్గా తెల్లారి రంగంలోకి దిగారు. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ని ఎవరో హ్యాక్ చేశారని, ట్విట్టర్ యాజమాన్యంతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం కనుగొంటామని తన పర్సనల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు లోకేష్. వైసీపీ వాళ్లకి కామెడీగా ఉన్నా.. టీడీపీ బ్యాచ్ కి మాత్రం ఈ హ్యాకింగ్ వ్యవహారం తలనొప్పిగా మారింది.
టెక్నాలజీ పితామహుడు అని చెప్పుకునే చంద్రబాబు, టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవుతుంటే ఏం చేస్తున్నారని నెటిజన్లు సరదాగా ప్రశ్నిస్తున్నారు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్.. ఇలా తన పరిచయాలను ఉపయోగించి చంద్రబాబు సమస్యను పరిష్కరించలేకపోయారా అంటూ ఆటాడేసుకుంటున్నారు ఏదేమైనా ఖాతా హ్యాక్ అవ్వడంతో ఏపీ ప్రజలు కాసేపు రిలాక్స్ అయ్యారు.