కొన్నాళ్ల క్రితం నుంచి మెగా ఫ్యామిలీ పిక్చర్స్ లో యాడ్ వన్ అవుట్ గా లావణ్య త్రిపాఠీ కనిపించేవారు. ఈమె ఎందుకు వుందబ్బా అని జనం వాళ్లలో వాళ్లు ప్రశ్నించుకునేవారు. ఆఖరికి వరుణ్ తేజ్-లావణ్యల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. కథ పెళ్లి దిశగా నడిచింది. త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఈ సందర్భంగా రకరకాల పార్టీల జరుగుతున్నాయి. ఈ పార్టీల ఫొటొలను ఫ్యామిలీలో ఎవరో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ రోజు కొన్ని ఫొటొలను అల్ల శిరీష్ షేర్ చేసారు. ఈ ఫొటొల్లో మెగా ఫ్యామిలీకి సంబంధించని వారు ముగ్గురు కనిపించారు. వారిలో హీరో నితిన్.. అతని భార్య వున్నారు. నితిన్ కొత్త పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ కు మాంచి స్నేహితుడు అందుకే భార్యా సమేతంగా వచ్చి వుండొచ్చు.
కానీ రీతూ వర్మ ఎందుకు వచ్చినట్లు? ఫొటో సోషల్ మీడియాలోకి రాగానే ఇదే అనుమానం నెటిజన్లకు. ప్రస్తుతం ఏ మెగా హీరోతోనూ సినిమా చేస్తున్నట్లు లేదు. మరి ఎవరి గెస్ట్ గా వచ్చినట్లు అన్నది పాయింట్. ఓ మెగా హీరోకు రీతూ వర్మ మంచి స్నేహితురాలని తెలుస్తోంది. ఈ ఇద్దరూ మంచి స్నేహితులని అందుకే ఈ ఫంక్షన్ కు ఆమెను కూడా ఆహ్వానించారని సమాచారం.
అంతకు మించి ఏమీ లేదు. జస్ట్ కో ఇన్సిడెన్స్ అంతే .