విశాఖకు భూం…ధూం ధాం..

విశాఖ అందాల నగరం. సిటీ ఆఫ్ డెస్టినీ. ఇక్కడకు జీవితకాలంలో ఒకసారి రావాలని ఎవరికైనా కోరిక. అలా వచ్చిన వారికి ఒక స్థలం అయినా ఉంటే బావుండు అని మరో కోరిక. అలా విశాఖలో…

విశాఖ అందాల నగరం. సిటీ ఆఫ్ డెస్టినీ. ఇక్కడకు జీవితకాలంలో ఒకసారి రావాలని ఎవరికైనా కోరిక. అలా వచ్చిన వారికి ఒక స్థలం అయినా ఉంటే బావుండు అని మరో కోరిక. అలా విశాఖలో ఇల్లు ఉండాలన్నది డ్రీమ్ గానే ఉంటూ వస్తోంది. దాంతో ఏ ఏటికి ఆ ఏడు విశాఖ భూములకు రెక్కలు వస్తున్నాయి. ధూం ధాం గా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. టార్గెట్లను రీచ్ అవుతున్నారు. భూమింగ్ చూస్తే మామూలుగా లేదు.

ప్రతీ ఏటా అరవై నుంచి డెబ్బై వేలకు తగ్గకుండా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. నెలకు వంద కోట్లకు తగ్గకుండా విశాఖ జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం వస్తోంది. ఇక ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం చివరకు వచ్చేసింది. కొత్త ఏడాది నుంచి రిజిస్ట్రేషన్ రేట్లు ఇప్పటికి ముప్పయి నుంచి నలభై శాతానికి పెరగబోతున్నాయి.

దాంతో గత ఏడాది కంటే కూడా ఈసారి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. విశాఖ సిటీలో చూసుకుంటే ఎనిమిది ఎనిమిది సబ్ రిజిస్ట్రెషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. ఎన్నారైలు కూడా విమానాలు వేసుకుని వచ్చి మరీ భూముల రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. విచిత్రం ఏంటి అంటే మధ్యతరగతి వర్గాలు కూడా పెద్ద ఎత్తున భూముల కొనుగోలు మీద దృష్టి పెట్టడం.

దాంతో ఈ ఏడాది 1400 కోట్ల ఆదాయం టర్గెట్ గా మరో పది రోజులే వ్యవధి ఉండగా దాదాపుగా రీచ్ అయ్యేలా పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే విశాఖ పాలనా రాజధాని అవుతుంది అన్న ప్రచారం ఒక వైపు ఏపీలో హైదరాబాద్ కి సరిసాటి సిటీ అన్న ట్యాగ్ మరో వైపు ఉండడంతో నానాటికీ విశాఖ డిమాండ్ పెరిగిపోతోంది. టోటల్ గా చూస్తే విశాఖ మంచి భూం లో ఉందనే చెప్పాలి.