పవన్ సినిమాలో కృతిశెట్టి

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి చకచకా సినిమాలు సైన్ చేస్తోంది. దాదాపు అందరు హీరోలు కృతి శెట్టి సరసన చేయడానికి ఉత్సాహపడుతున్నట్లు కనిపిస్తోంది.  Advertisement లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా కృతి…

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి చకచకా సినిమాలు సైన్ చేస్తోంది. దాదాపు అందరు హీరోలు కృతి శెట్టి సరసన చేయడానికి ఉత్సాహపడుతున్నట్లు కనిపిస్తోంది. 

లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా కృతి శెట్టి ని తీసుకోవడానికి డిస్కషన్లు సాగుతున్నాయి. అయితే పవన్ సరసన నటించడానికి. పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా.

పీపుల్స్ మీడియా సంస్థ సముద్రఖని డైరక్షన్ లో పవన్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ రీమేక్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో పవన్ పాత్ర కాకుండా సాయితేజ్ పాత్ర వాస్తవానికి వృద్దుడి పాత్ర. కానీ తెలుగు కోసం యువకుడి పాత్రగా మారుస్తున్నారు. అందువల్ల పాటలు, ఫైట్లు అన్నీ వుంటాయి. అందుకే హీరోయిన్ కావాలి.

ఆ వేటే సాగుతోంది. ప్రాబబుల్స్ లో మొదటి పేరు కృతిశెట్టి అని వినిపిస్తోంది. ఆమె డేట్ లు సెట్ కావడం కీలకం. ఎవరి డేట్ లు త్వరగా, బల్క్ గా దొరికితే వాళ్లను తీసుకుంటారు. ఆ విషయంలో కృతిశెట్టి టీమ్ తో చర్చలు సాగుతున్నాయి.