నాదెండ్ల మనోహర్‌ పై సంచలన వ్యాఖ్యలు!

కాపుల పార్టీగా చెప్పుకునే జ‌న‌సేన‌లో చివ‌రికి ఆ సామాజిక వ‌ర్గం నాయ‌కుల్ని కూడా ఉండ‌నివ్వ‌ర‌ని ఇటీవ‌ల వైసీపీ చేరిన నెల్లూరు జ‌న‌సేన నాయ‌కుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆరోపించారు. త‌న‌ను పార్టీ మారావ‌ని విమ‌ర్శిస్తున్న వాళ్లు…జేడీ…

కాపుల పార్టీగా చెప్పుకునే జ‌న‌సేన‌లో చివ‌రికి ఆ సామాజిక వ‌ర్గం నాయ‌కుల్ని కూడా ఉండ‌నివ్వ‌ర‌ని ఇటీవ‌ల వైసీపీ చేరిన నెల్లూరు జ‌న‌సేన నాయ‌కుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆరోపించారు. త‌న‌ను పార్టీ మారావ‌ని విమ‌ర్శిస్తున్న వాళ్లు…జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, తోట చంద్ర‌శేఖ‌ర్‌, త‌దిత‌ర ఐపీఎస్‌, ఐఆర్ఎస్ నాయ‌కులు జ‌న‌సేనను వీడ‌డంపై స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కోస్తాలో టీడీపీ క‌మ్మ నాయ‌కుల ప‌ల్ల‌కీని కాపులు మోయాల్సి వ‌స్తోంద‌న్న ఆవేద‌న వారిలో వుంద‌న్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ షూటింగ్‌ల‌కే ప‌రిమితం అయ్యార‌ని విమ‌ర్శించారు. వారంలో వీకెండ్స్‌లో మాత్ర‌మే ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో పాల్గొంటార‌ని త‌ప్పు ప‌ట్టారు. ప‌వ‌న్ చెప్ప‌ద‌లుచుకున్న‌ది చెప్పి వెళ్లిపోతార‌న్నారు. జ‌న‌సేన‌ను రేప్ చేసేది నాదెండ్ల మనోహ‌ర్ అంటే కేతంరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. వైసీపీలో ఉన్న కాపు మంత్రుల్ని పాలేర్ల‌ని జ‌న‌సేన నాయ‌కులు విమ‌ర్శిస్తుంటార‌న్నారు.

తాను కూడా జ‌న‌సేన‌కు ఒక పాలేరులా ప‌ని చేశాన‌ని కేతంరెడ్డి అన్నారు. జ‌న‌సేన నాయ‌కుల మాట‌లు న‌మ్మి మంత్రుల్ని పాలేర్ల‌ని తాను కూడా విమ‌ర్శించిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. జ‌న‌సేన నాయ‌కులు, అలాగే నాదెండ్ల మ‌నోహ‌ర్ దృష్టిలో వైసీపీలో ప‌ని చేసే కాపు నాయ‌కులు మాత్ర‌మే పాలేర్ల‌ని ఆయ‌న అన్నారు. టీడీపీలో ప‌ని చేసే బ‌లిజ నాయ‌కుడు , మాజీ మంత్రి నారాయ‌ణ లాంటి వారంతా వాళ్ల దృష్టిలో దేవుళ్ల‌ని వెట‌క‌రించారు. నారాయ‌ణ కింద వారంతా పాలేర్ల‌గా ప‌ని చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

చంద్ర‌బాబునాయుడికి జ‌న‌సేన నాయ‌కులు ఊడిగం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కులాలు, మ‌తాల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. 300 రోజుల‌కు పైగా తాను నెల్లూరులో ఇంటింటికి తిరిగాన‌న్నారు. ఆ స‌మ‌యంలో ఇళ్ల‌లోకి తీసుకెళ్లి త‌మ ఇంటి గోడ‌ల‌పై ఉన్న వైఎస్ జ‌గ‌న్ ఫొటో చూపేవార‌న్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో ల‌బ్ధి పొందామ‌ని త‌మ‌కు ప్ర‌జ‌లు చెప్పేవార‌న్నారు. ప్ర‌జ‌ల గుండెల్లో వైఎస్ జ‌గ‌న్ చిర‌స్థాయిగా నిలిచిపోతార‌న్నారు. వైసీపీలో చేరాన‌ని ఈ మాట చెప్ప‌డం లేద‌న్నారు.