పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చిరకాలంగా వేచి వున్నారు దర్శకుడు హరీష్ శంకర్. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమాను వెనక్కు నెడుతున్నారని గ్యాసిప్ లు వినిపించాయి. అయితే హరీష్ శంకర్ ఇప్పటి వరకు పూర్తి కథ చెప్పలేదని, కొన్ని సీన్లు మాత్రం చెప్పారని పవన్ కళ్యాణ్ నిర్మాత నవీన్ తో అన్నారనే గ్యాసిప్ కూడా బయటకు వచ్చింది.
హరీష్ కథ చెప్పిన వెంటనే డేట్ లు ఇవ్వడానికి తాను రెడీ అని పవన్ అన్నట్లు కూడా వినిపించింది. ఇవన్నీ ఎంత వరకు నిజమో కానీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో దర్శకుడు హరీష్ శంకర్ వదులుతున్న ఫొటోలు చూస్తుంటే మాత్రం ఇప్పుడు ఆయన కథ వంటకం మీద సీరియస్ గా కూర్చున్నారనే సంకేతాలు అందిస్తోంది. భంగిమ వన్..టూ అన్నట్లుగా రకరకాల సింబాలిక్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.
అంటే దీన్ని బట్టి కథ ఇప్పుడు రెడీ అవుతోందనుకోవాలా? అంటే దాదాపు రెండేళ్లుగా హరీష్ ఖాళీగానే వున్నారు. ఆ టైమ్ లో కథ రెడీ చేయలేదు అనుకోవాలా? లేక పవన్ వైపు నుంచి గ్యాసిప్ లు వినిపించగానే ఫైన్ ట్యూన్ చేస్తున్నారా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ఈ సినిమా 2022 లో సెట్ మీదకు వెళ్తుందా? ఎందుకంటే పవన్ ఇప్పటికే సగం చేసి పక్కన పెట్టిన హరి హర వీరమల్లు వుండనే వుంది. అది కాక మరో రెండు సినిమాలు స్టార్ట్ చేయబోతున్నారు. వాటితోనే 2022 సరిపోయేలా వుంది.