‘భయో’ డేటా: ‘ఆర్’ క్యూబ్!

నా పేరు:  రఘు రామకృష్ణం రాజు. Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: చేరే పార్టీయే ప్రకటించటంలేదు, దరఖాస్తు చేసే పదవిని ఎలా ప్రకటిస్తాను? అందాకా ‘వివాదాస్పత నేత’ అన్న పోస్టు పరిమితమయ్యాను. సినిమా రంగంలో…

నా పేరు:  రఘు రామకృష్ణం రాజు.

దరఖాస్తు చేయు ఉద్యోగం: చేరే పార్టీయే ప్రకటించటంలేదు, దరఖాస్తు చేసే పదవిని ఎలా ప్రకటిస్తాను? అందాకా ‘వివాదాస్పత నేత’ అన్న పోస్టు పరిమితమయ్యాను. సినిమా రంగంలో ‘రామ్ గోపాల్ వర్మ’ తెచ్చుకునే ప్రచారాన్నే , నేను అందాకా రాజకీయాల్లో తెచ్చుకుంటున్నాను. లేక పోతే, ఒక ఎంపీ గురించి ఇంతిలా ఎవరు మాట్లాడుకుంటారు చెప్పండి?

వయసు: నెత్తి మీద వున్న ‘విగ్గు’లాంటి ‘సొంత తల’మీద వొట్టు, నేనింకా యువకుణ్ణే.

ముద్దు పేర్లు : 'ఆర్' క్యూబ్, అంటే నా పేరు లో మూడు ‘ఆర్’లు వుంటాయి లెండి. ‘రోజూ రచ్చెకక్కే రాజు’ ( నా అసలు పేరుకే కాదు, పెట్టుడు పేరుకు మూదు ‘ఆర్’లూ సరిపోయాయా?) కనిపించని నాలుగో సింహం లాగా, కనిపించని నాలుగో ‘ఆర్’ కూడా వుంటుంది. మీ ఇష్టం దానిని ‘రెలిజియన్’ అనుకోండి. లేదా ‘ఆరెస్సెస్’ అనుకోండి.

విద్యార్హతలు:  అడగాలే కానీ, ఆంగ్లంలో కూడా కుమ్మేస్తాను. ‘బడి’ విద్య ఎప్పుడో నేర్చుకున్నాను. ‘గుడి’ విద్య ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.

విలాసం: నన్ను పట్టుకోవటానికి పెద్ద కష్టపడనవసరంలేదు, సోము వీర్రాజు గారిని అడగండి. ఎప్పుడు ఎక్కడ వుంటానో ఇట్టే చెప్పగలరు. పవన్ కల్యాణ్ గారిని అడగండి. నా ఫోన్ ఎవరికి కలవక పోయినా, ఆయనకు కలుస్తుంది. నెట్ వర్క్ ప్రోబ్లెం వుండదు.

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: ఇప్పుడన్నీ కొండ గుర్తులే. ఆంధ్రప్రదేశ్‌లో ‘గుడుల్లే’ కొండలుండవు. గుడికి వెళ్ళితే ‘పుణ్యం’ వస్తుందని పూర్వం నమ్మేవారు. ‘పవర్’ వస్తుందని ఇప్పుడు నిర్థారించేశారు. పార్లమెంటు గుడిలాంటిదంటే ఏదో అనుకునే వాణ్ణి. అసలు గుడే పార్లమెంటు.

రెండు: శత్రుత్వం మనుషుల్లో చూస్తే మామూలు నేత. అదే దేవుళ్ళలో చూసాడనుకోండి. వాడే నేటి రాజకీయ నేత. ఇది ‘దేవ రహస్యం’ సుమీ.

సిధ్ధాంతం: ఎవరి కేసుకు వారే న్యాయం చెయ్యగలరు. స్త్రీలమీద దాడులు జరుగుతున్నాయి. మహిళా పోలీసు అధికారినే వెయ్యాలి. పసిపిల్లల మీద పెద్దల దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. పిల్ల పోలీసుల చేత విచారణ జరిపించాలి. హిందూ దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. హిందూ పోలీసు అధికారులనే వెయ్యాలి. దేవాలయాల్లోకి దళితులను రానివ్వటంలేదు…అప్పుడు దళిత పోలీసు అధికారు…. వద్దులెండి. తర్వాత మాట్లాడదాం.

వృత్తి: పాలన. ఏమిటో అలా వచ్చేసిందంతే.

హాబీలు: 1. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వటం. (ఇంతకీ అంబేద్కర్‌ది హిందూమతం అవునో కాదో మరి! ఆయన మతం మార్చుకున్నాడో లేదో మరి!)

2. అంబేద్కర్ విగ్రహప్రతిష్టాపనను నిలువరించినప్పుడు కోపం వచ్చింది. ఆయన ఎవరికి దేవుడో నాకు ఇప్పటికీ తెలియదు. అప్పుడు విచారణ ఏ మతం అధికారితో చేయించారో గుర్తులేదు.

అనుభవం: దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే కోపం వచ్చింది. నాకే కాదు బాబు గారికి కోపం వచ్చింది, కల్యాణ్ గారికి కోపం వచ్చింది. కానీ ధ్వంసం చేసిన వాళ్ళని పట్టుకుంటున్నామంటే మరింత కోపం వచ్చింది. రాదూ మరి. ఎవర్ని పట్టుకుంటే వారిని నేరస్తులని మేమెలా నమ్ముతాం? మా నమ్మకాలు మాకుంటాయి.

మిత్రులు: దేవుళ్ళేక రక్షణ లేని చోట వుంటున్నాం. మిత్రులేకం రక్షణ వుంటుంది లెండి.

శత్రువులు: సర్వమత సమానత్వం కోరుకునే వాణ్ణి. ఎక్కువ భక్తులున్న మతాన్ని ఎక్కువ సమానంగా చూసుకుంటాను. ఎక్కువ వోట్లుంటాయని కాదు సుమీ!

మిత్రశత్రువులు: శత్రుమిత్రులే ఎక్కువ. ఎవరి పేరు పెట్టుకుని నిలుస్తానో వారు మిత్రశత్రువులు. ఎవరి  పేరును చెప్పకుండా బలపరుస్తానో వారే శత్రుమిత్రులు

జీవిత ధ్యేయం: ఏమో ఓడలు బళ్ళు కావా? బళ్ళు వాడలు కారా? మంత్రులు రాజులయినప్పుడు, రాజులు మత్రులు కారా? ముఖ్యమంత్రులు కారా..!?  

-సర్

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్