ఇప్పుడిప్పుడే మన హీరోలు కాస్త మారుతున్నారు. నిజానికి ఎప్పటి నుంచో వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ముందుకు వచ్చే వెంకటేష్ ఈ రేస్ లో ముందున్నారు. ఆయన ఇప్పుడు లేటెస్ట్ గా రెడీ చేసిన సైంధవ్ సినిమా పక్కా కాంటెంపరరీగా, పక్కా హై ఎండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోందని విడుదల చేసిన టీజర్ చెబుతోంది.
హిట్ సినిమాతో హిట్ డైరక్టర్ అనిపించుకున్న శైలేష్ కొలను ఈ సైంధవ్ కు దర్శకుడు. యాంటీ సోషల్ యాక్టివింటీ చేసే విలన్లు, డ్యూటీ నుంచి పక్కకు తప్పకుని, మళ్లీ డ్యూటీ ఎక్కి వీరి పని పట్టే ఏజ్డ్ హీరోగా వెంకీ కనిపించారు.
టీజర్ మొత్తం హై ఎండ్ యాక్షన్ కట్స్ తోనే వెళ్లింది. వెంకీ యాంగ్రీ మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా పెర్ ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ మాంచి సపోర్ట్ ఇచ్చింది. సినిమాలో కథ పాయింట్ కన్నా, కథనం ఎక్కువ ప్రయారిటీ సీట్ తీసుకుందని క్లారిటీ వచ్చేసింది. శైలేష్ టేకింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టీజర్ లో కనిపిస్తున్నాయి.
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ స్పెషల్ గా కనిపించాడు. టోటల్ గా టీజర్ అయితే సినిమా గురించి ఓ ప్రామిసింగ్ నోట్ ను ఇండస్ట్రీలోకి, ట్రేడ్ లోకి పంపించింది. సంక్రాంతికి గట్టిపోటీ నడుమ ఈ సినిమా విడుదలవుతోంది. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాకు నిర్మాత.