విశాఖ ఐటీ పరంగా ముందుకు దూసుకుపోతోంది. విశాఖ పొటెన్షియాలిటీ రానున్న అయిదేళ్లలో అయిదు లక్షల జాబ్స్. ఇది స్టడీ చేసి తేల్చిన విషయం. ప్రస్తుతం పాతిక వేలకు పైగా జాబ్స్ తో విశాఖ ఐటీలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఐటీ కేంద్రంగా విశాఖను నిలిపించేందుకు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలను తీసుకుంటోంది. ఉత్తరాంధ్రా తో పాటు అటు ఒడిషా, కోల్‌కత్తాల నుంచి వచ్చే వారికి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ కాకుండా ఇక మీదట విశాఖ ఆకర్షించబోతోంది.
వారిని విశాఖలోనే నిలుపు చేసి మంచి జాబ్స్ ఇచ్చేలా ఐటీ సెక్టార్ స్టీల్ సిటీలో వేళ్ళూనుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రణళికాబద్ధంగా ఐటీని వైజాగ్ లో అభివృద్ధి చేస్తోంది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖ రావడం వెనక ప్రభుత్వం చొరవ ప్రయత్నం చాలా ఉన్నాయి.
రానున్న రోజులలో మరిన్ని ఐటీ కంపెనీలు విశాఖలో ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటిదాకా చూస్తే సౌతిండియాలో బెంగళూరు, హైదరాబాద్ చెన్నై ఐటీ కేంద్రాలుగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం తాను పెట్టుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తే మాత్రం కచ్చితంగా రానున్న అయిదేళ్ళలో విశాఖ ఐటీలో సౌతిండియాలో నంబర్ వన్ అవుతుంది అని ఐటీ రంగం నిపుణులు అంటున్నారు.
ఏటా విశాఖ సహా ఉత్తరాంధ్రా నుంచి పదిహేను నుంచి ఇరవై లక్షలకు పైగా ఇంజనీరింగ్ విద్యార్ధులు బయటకు వస్తున్నారు. వీరందరికీ స్థానికంగా ఉపాధి అందించడం ద్వారా మంచి నిపుణతతో కూడా ఐటీ ఉద్యోగులను పరిమితమైన వ్యయంతో కూడిన మానవవనరులను కూడా అందిపుచ్చుకోగలమని దిగ్గజ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి.
ఐటీ రంగం విశాఖలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఆయన విశాఖ ప్రగతి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.