కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సెకెండ్ హీరోయిన్ పాత్రలు చేయలేదు కృతిశెట్టి. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ, కృతి పాత్ర సెపరేట్. ఆమె క్యారెక్టర్ ఆమెదే. ఇలాంటి హీరోయిన్ ఇప్పుడు సెకెండ్ లీడ్ చేయడానికి ఒప్పుకుంటుందా?
నితిన్-రష్మిక మరోసారి కలిశారు. వెంకీ కుడుములతో కలిసి భీష్మ మేజిక్ ను రిపీట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి కృతి శెట్టిని కూడా తీసుకుంటున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ రష్మిక ఉన్న సినిమాలో కృతి శెట్టి నటిస్తుందా?
సెకెండ్ హీరోయిన్ గా నటించనుందంటూ, కృతి శెట్టిపై ఇలా పుకార్లు రావడానికి ఓ బలమైన కారణం ఉంది. రీసెంట్ గా ఆమె సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. బంగార్రాజు తర్వాత ఆమె ఖాతాలో హిట్స్ లేవు. రీసెంట్ గా వచ్చిన కస్టడీ కూడా ఫ్లాప్. దీంతో ఆమె నితిన్ సినిమాలో సెకెండ్ లీడ్ కు ఒప్పుకుందంట. అటు నితిన్-కృతి కలిసి గతంలో మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
అయినా హీరోయిన్లు ఇప్పుడు ఫస్ట్ లీడ్, సెకెండ్ లీడ్ అని చూడడం లేదు. శ్రీలీల సైతం మహేష్ మూవీలో సెకెండ్ హీరోయిన్ గానే కనిపించనుంది. కాబట్టి కృతి శెట్టి కూడా ఇక అలాంటి పాత్రలకు ఓకే చెబితే బెటరేమో.