ప్రభాస్ క్రేజా..శ్రీరాముడి మీద భక్తా?

తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. జనం వేలాదిగానో, ఇంకా ఎక్కువగానో తరలి వచ్చారు. Advertisement రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ బైక్…

తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. జనం వేలాదిగానో, ఇంకా ఎక్కువగానో తరలి వచ్చారు.

రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ బైక్ లు పార్కింగ్ చేసేసారు. అసలు ఆ బైక్ లు మళ్లీ వెనక్కు ఎలా తీసుకోగలరు అనేంత అనుమానం కలిగేలా పార్కింగ్ జరిగింది.

గ్రౌండ్ లోపల, బయట జనం..జనం..జనం. అమ్మాయిలు సైతం గోడలు దూకి లోపలకు రావడం, గోడలు ఎక్కి నిల్చోవడం విశేషం.

ఇదంతా ప్రభాస్ మీద క్రేజ్ నా? లేక శ్రీరాముడి మీద భక్తా? ఎందుకంటే చిన్నా, పెద్దా అంతా చేతిలో కాషాయజెండాలు పట్టుకుని వుండడం విశేషం. పోనీ కుర్రాళ్లు, యువత అలా చేసారంటే మాస్ హిస్టీరియా అనుకోవచ్చు. క్లాస్ జనాలు, పోలీసు అధికారుల కుటుంబాలు కూడా ఇలాగే జెండాలు చేత పట్టుకునే ఆద్యంతం కూర్చోవడం విశేషం.

విఐపి లైన్ లు అన్నీ దాదాపుగా పోలీసుల కుటుంబాలతోనే నిండిపోయాయి. ప్రభాస్ సభా ప్రాంగణానికి వచ్చాక ఇక కంట్రోలు చేసే బాధ్యతను అందరూ విస్మరించారు. పోలీసులు సైతం ప్రభాస్ ను చూడడానికి గుమిగూడడం విశేషం.

సాయంత్రం వర్షం పడుతుందన్న సూచనలు కనిపించినా, అస్సలు వాన జాడ లేదు. చిన్న జల్లు మాత్రం కురిసింది. అది కూడా కొ్ద్ది సేపు మాత్రమే. జై శ్రీరామ్ నినాదాలు పదే పదే మిన్నంటాయి. పాటలు వచ్చినపుడల్లా జనం కోరస్ పలకడం విశేషం. మొత్తం మీద శ్రీరామ్ భక్తి భావం జనాల్లో బలంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.