ఆదిపురుష్ ఫైనల్ ట్రయిలర్.. ఫుల్ యాక్షన్!

ఆదిపురుష్ యూనిట్ తమ సినిమాకు సంబంధించి దేనిపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుందనే విషయం ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే ఈజీగా అర్థమౌతుంది. అవును.. ఆదిపురుష్ కు సంబంధించి కొద్దిసేపటి కిందట విడుదల చేసిన ఫైనల్…

ఆదిపురుష్ యూనిట్ తమ సినిమాకు సంబంధించి దేనిపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుందనే విషయం ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే ఈజీగా అర్థమౌతుంది. అవును.. ఆదిపురుష్ కు సంబంధించి కొద్దిసేపటి కిందట విడుదల చేసిన ఫైనల్ ట్రయిలర్ లో పూర్తిస్థాయిలో యుద్ధ సన్నివేశాలు చూపించారు.

ఇంకా చెప్పాలంటే.. 2 నిమిషాల 20 సెకన్లు ఉన్న ఈ ట్రయిలర్ లో రామ-రావణ యుద్ధాన్ని ఆవిష్కరించారు. రాఘవుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే సీన్ ను కూడా ఉంచారు. ఆ టైమ్ లో రాఘవ వేషధారి ప్రభాస్ తో ఓ డైలాగ్ కూడా చెప్పించారు.

సినిమా విడుదలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు, ఎలాంటి ట్రయిలర్ రిలీజ్ చేయాలో అలాంటి కట్ తోనే ప్రేక్షకుల ముందుకొచ్చారు మేకర్స్. అయితే ఆమధ్య విడుదల చేసిన ట్రయిలర్ లో జానకి పాత్రధారి కృతి సనన్, ఏ సందర్భంలో డైలాగ్ చెబుతుందో, తాజా ట్రయిలర్ లో కూడా అదే సందర్భంలోని డైలాగ్ ను పెట్టారు. జానకి పాత్రకు సంబంధించి మరో సన్నివేశంలో డైలాగ్ ఏదైనా పెడితే బాగుండేది.

ఈ సంగతి పక్కనపెడితే.. సినిమా క్లయిమాక్స్ విజువల్ వండర్ గా ఉండబోతోందనే విషయాన్ని ఫైనల్ ట్రయిలర్ చాటిచెప్పింది. మరీ ముఖ్యంగా త్రీడీలో చూడాల్సిందే అంటూ ఊరించే విధంగా ఉంది ట్రయిలర్.

ఈ ట్రయిలర్ తో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. ప్రభాస్, కృతిసనన్ నటించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. 16న వరల్డ్ వైల్డ్ థియేటర్లలో రాఘవ ఆగమనం.