ప్రజలపై కక్ష తీర్చుకుంటున్న చంద్రబాబు

మొన్న ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అసెంబ్లీలో కనీస మెజారిటీ కూడా ఇవ్వకుండూ మూలన కూర్చోబెట్టారు. ఆ కసి-కోపం-పగ చంద్రబాబులో అలానే ఉన్నాయి.  Advertisement ప్రజలపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ఆయన…

మొన్న ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అసెంబ్లీలో కనీస మెజారిటీ కూడా ఇవ్వకుండూ మూలన కూర్చోబెట్టారు. ఆ కసి-కోపం-పగ చంద్రబాబులో అలానే ఉన్నాయి. 

ప్రజలపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ఆయన పగ పెంచుకున్నాడు. అందుకే ఇలా కరోనా టైమ్ లో స్థానిక ఎన్నికలు పెట్టేలా, నిమ్మగడ్డతో నోటిఫికేషన్ ఇప్పించారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఈ కరోనా టైమ్ లో ప్రజలంతా పోలింగ్ స్టేషన్లకు వచ్చి వైరస్ బారిన పడితే, చంద్రబాబు కళ్లు చల్లారుతాయన్నారు. అదే ఆయన ప్లాన్ అని ఆరోపించారు.

“చంద్రబాబుకు ఏపీ ప్రజల మీద చాలా కక్ష ఉంది. తనను చిత్తుచిత్తుగా ఓడించిన ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి ఆయన ఇలా కరోనా టైమ్ లో స్థానిక ఎన్నికల్ని తెప్పిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ను తొందర పెడుతున్నారు. ఇలా ప్రజలపై తన కక్షను తీర్చుకునే ప్రణాళిక వేశారు బాబు.”

ఇదే కరోనా టైమ్ లో ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. మరి ఆ కార్యక్రమాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందదా అని ప్రశ్నించే వాళ్లకు సమాధానం ఇచ్చారు అంబటి. కార్యక్రమాలకు రావాలా వద్దా అనేది ప్రజల ఇష్టమని, పోలింగ్ రోజు మాత్రం ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఓట్లు వేయాలంటూ తేడాను వివరించారు.

“ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు, వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు కదా, అప్పుడు రాని కరోనా.. ఎన్నికలు పెడితే వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. అలాంటి వాళ్లకు నేను చెప్పేది ఒకటే. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాలు ఆప్షనల్. నచ్చితే రావొచ్చు లేకపోతే లేదు. కానీ పోలింగ్ ఆప్షనల్ ఎలా అవుతుంది. ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందే. 90ఏళ్ల వృద్ధుడు కూడా వచ్చి ఓటేయాల్సిందే.”

క్షేత్రస్థాయిలో ఎన్నికలకు అనువైన పరిస్థితులు లేనప్పుడు పోలింగ్ జరపకూడదనే ప్రాధమిక నియమాన్ని మరిచి ఎన్నికల కమిషనర్ ప్రవర్తిస్తున్నారని అంబటి ఆరోపించారు.

దర్శకుడిగా మారుతున్న రవితేజ

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?