ఆదిపురుష్ కోసం హనుమాన్ ను ఆపుతున్నారా?

ఆదిపురుష్ సినిమాకు, హనుమాన్ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఈ రెండు సినిమాల్లో ఉన్న కామన్ ఎలిమెంట్ హనుమంతుడు. ఆదిపురుష్ లో హనుమంతుడి పాత్ర ఉంది. హనుమాన్ లో కూడా ఆంజనేయస్వామి రిఫరెన్స్…

ఆదిపురుష్ సినిమాకు, హనుమాన్ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఈ రెండు సినిమాల్లో ఉన్న కామన్ ఎలిమెంట్ హనుమంతుడు. ఆదిపురుష్ లో హనుమంతుడి పాత్ర ఉంది. హనుమాన్ లో కూడా ఆంజనేయస్వామి రిఫరెన్స్ ఉంది. హనుమాన్ టీజర్ లో మనం ఈ విషయాన్ని చూశాం కూడా.

అందుకే, ఆదిపురుష్ సినిమా కోసం ఎప్పటికప్పుడు హనుమాన్ మూవీ విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నారంటూ ఈమధ్య పుకార్లు వచ్చాయి. ఈ రూమర్స్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ ఖండించాడు.

తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ.. ఆదిపురుష్ కోసం తమ సినిమాను వాయిదా వేయలేదని స్పష్టం చేశాడు. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల మాత్రమే హను-మాన్ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందని వెల్లడించాడు.

ఈమధ్య కాలంలో ఎక్కువసార్లు వాయిదాపడిన సినిమాగా రికార్డ్ సృష్టించింది హను-మాన్ మూవీ. నిజానికి ఈ సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్ లోనే తీసుకొద్దాం అనుకున్నారు. అలానే చేశారు కూడా. ఎప్పుడైతే టీజర్ పాన్ ఇండియా లెవెల్లో హిట్టయిందో, వెంటనే ప్లాన్స్ మారిపోయాయి. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశారు, మిగతా భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు, గ్రాఫిక్ వర్క్ కూడా పెంచారు.

అందుకే హనుమాన్ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. అంతేతప్ప, ఆదిపురుష్ కు లైన్ క్లియర్ చేయడం కోసం హనుమాన్ ను పోస్ట్ పోన్ చేయడం లేదని స్పష్టం చేశాడు ప్రశాంత్ వర్మ. ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేస్తన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉండాలనే అంశం నుంచి ప్రతి విషయాన్ని ప్రశాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నాడు.