Advertisement

Advertisement


Home > Movies - Movie News

తల దించుకొని, దర్శకుడికి సారీ చెప్పి వెళ్లిపోయాడు

తల దించుకొని, దర్శకుడికి సారీ చెప్పి వెళ్లిపోయాడు

సీనియారిటీ పెరిగేకొద్దీ నటుల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏ సీన్ అయితే ఏంటి, చేసేద్దాం అనే నమ్మకం ఎక్కువైపోతుంది. అలాంటి అతి నమ్మకంతోనే సెట్స్ పైకి అడుగుపెట్టి ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది. మొన్నటికిమొన్న నాని విషయంలో ఇలానే జరిగింది, ఇప్పుడు నాగశౌర్య విషయంలో కూడా అదే రిపీట్ అయింది.

పవన్ బాసంశెట్టి డైరక్షన్ లో రంగబలి అనే సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. తనకున్న అనుభవంతో, మొదటి రోజు ఈజీగానే పని కానిచ్చేయొచ్చని భావించిన ఈ దర్శకుడికి, పవన్ చిన్నపాటి షాకిచ్చాడు. ఆ విషయాన్ని నాగశౌర్య బయటపెట్టాడు.

"ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ చాలా ఇబ్బంది పడ్డాను. నా లైఫ్ లో మరిచిపోలేను. మొదటి రోజే 6 పేజీల డైలాగ్ ఇచ్చాడు. ఆ డైలాగ్ ను నా ఒరిజినల్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ లో చెప్పాలి. నా కళ్ల ముందే 10 టేక్స్ అయిపోయాయి. ఎప్పుడైతే 10 టేకులు దాటాయో నాకు మైండ్ బ్లాక్ అయింది, సగం డైలాగ్స్ మరిచిపోయాను. 20..30..40..50 టేకులయ్యాయి. డైరక్టర్ ప్యాకప్ చెబుతానన్నాడు. అందరి ముందు వెధవ అయిపోతానేమో అని భయమేసింది. ఎలాగైనా చేయాలనుకున్నాను. రాత్రి 8 అయింది. టేక్ ఓకే అవ్వలేదు. ఈలోగా 5 పేజీల డైలాగ్స్ మరిచిపోయాను. దాంతో ఫస్ట్ డే తలదించుకొని, దర్శకుడికి సారీ చెప్పి వెళ్లిపోయాను."

ఇలా రంగబలి సినిమా మొదటి రోజు షూటింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ సెట్ అయిందని, అప్పట్నుంచి సినిమా పూర్తయ్యేవరకు ఎక్కడా బండి ఆగలేదని అన్నాడు ఈ హీరో.

ఇలాంటి దెబ్బ హీరో నానికి కూడా రీసెంట్ గా తగిలింది. దసరా సినిమా మొదటి రోజు నాని కూడా ఇలానే ఓవర్ కాన్ఫిడెన్స్ తో సెట్స్ లో అడుగుపెట్టాడు. కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎప్పటికీ ఓకే చెప్పలేదు. దీంతో నాని ఇగో హర్ట్ అయింది. ఎలాగైనా సీన్ పండించాలని కష్టపడ్డాడు కానీ కుదరలేదు. చివరికి శ్రీకాంత్ ఇచ్చిన సలహాలతోనే తొలి రోజు సీన్ కంప్లీట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు నాని.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?