లాభాలు వస్తే.. బయ్యర్ల సంగతేమిటి?

ఎంసిఎ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత హీరో నాని నుంచి వరుసగా వచ్చిన సినిమాలు Advertisement కృష్ణార్జున యుద్దం, నిన్నుకోరి, దేవదాస్, జెర్సీ, వి, గ్యాంగ్ లీడర్, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే…

ఎంసిఎ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత హీరో నాని నుంచి వరుసగా వచ్చిన సినిమాలు

కృష్ణార్జున యుద్దం, నిన్నుకోరి, దేవదాస్, జెర్సీ, వి, గ్యాంగ్ లీడర్, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా.

వీటిలో కృష్ణార్జున యుద్దం, దేవదాస్, వి, గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి సినిమాల పరిస్థితి వివరంగా చెప్పనక్కరలేదు.

నిన్ను కోరి మంచి హిట్. టక్ జగదీష్ ఓటిటి లోకి వెళ్లిన సంగతి దానికి వచ్చిన టాక్ సంగతి తెలిసిందే.

ఇక మిగిలినవి జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా.

మూడూ మంచి సినిమాలు అందులో అణుమాత్రం సందేహం లేదు. జెర్సీకి లాభాలు వచ్చాయి. కానీ కొంతమంది బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చిందన్నది తెరవెనుక వాస్తవం.

శ్యామ్ సింగరాయ్ సినిమా నిర్మాతకు పేరు వచ్చింది కానీ లాభాలు రాలేదు అన్నది ఇండస్ట్రీలో ఇప్పటికీ వినిపిస్తూనే వుంటుంది.

దసరా సినిమా వల్ల ఆంధ్రలో బయ్యర్లంతా ముఫై శాతం నుంచి యాభైశాతం నష్టపోయారు. సీడెడ్ లో అంతకు మించి నష్టపోయారు.

నిజానికి దసరా సినిమాను కానీ, శ్యామ్ సింగరాయ్ సినిమాను కానీ కాస్త బడ్జెట్ కంట్రోల్ లో తీసి వుంటే, నిర్మాతలు కాస్త తక్కువకు అమ్మడం అనేది జరిగి వుండేది. దాని వల్ల బయ్యర్ల బ్రేక్ ఈవెన్ అయి వుండేవారు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే, ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో హీరో నానిని ‘మీ సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడం లేదు..కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నాయి’ అని అడగడం జరిగింది. దానికి ఆయన ఎవరు చెప్పారు? ఏ నిర్మాత చెప్పారు? నిర్మాతలకు థియేటర్ ఆదాయం మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ఆదాయాలు వస్తాయి. అందువల్ల బ్రేక్ ఈవెన్ కాకపోవడం అనే సమస్యే లేదు. అసలు అలాంటి ప్రచారాలను మీ మీడియా ఖండించాలి కానీ, మీరే అడిగితే ఎలా? అనే విధంగా సమాధానం ఇచ్చారు.

చిత్రంగా ఈ సంఘటన జరిగిన కొన్ని గంటలకే జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ ప్రొడక్షన్ హవుస్ లు నుంచి ట్వీట్ లు వెలువడ్డాయి. జెర్సీ వల్ల తమకు మంచి లాభాలు వచ్చాయి ఆ ప్రొడక్షన్ హవుస్, శ్యామ్ సింగరాయ్ తమకు ఇండస్ట్రీలో మంచి పాత్ వేసిందని, అలాంటి సినిమాలు తీయాలన్నదే తమ కోరిక అని ఆ యూనిట్ ట్వీట్ లు వేసాయి.

దీనికి పలువురు బిజినెస్ స్కర్కిళ్ల జనాలు స్పందించి ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఫోన చేసి, మరి చిరకాలంగా నాని సినిమాలు కొన్న బయ్యర్లు కూడా తమకు బోలెడు లాభాలు వచ్చాయని ట్వీట్ లు వేయచ్చు కదా అని అడగడం విశేషం. సరే, ఇక్కడ నాని తో వాదనకు దిగడం ఉద్దేశం ఎంత మాత్రం కాదు.

జెర్సీ నాటికి నాని రెమ్యూనిరేషన్ తొమ్మిది కోట్లు అని టాక్. అప్పట్లో నాని సినిమా ఖర్చు 30 కోట్ల మేరకు వుండేది. దసరా సినిమాకు 70 కోట్లకు చేరుకుంది నిర్మాణ వ్యయం. హాయ్ నాన్న సినిమాకు నాని రెమ్యూనిరేషన్ నే 22 కోట్లు అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. రెమ్యూనిరేషన్ ఎలా వున్నా, కాస్ట్ కంట్రోల్ చేయడం ద్వారా, థియేటర్ బిజినెస్ ను బ్రేక్ ఈవెన్ దిశగా నడిపించవచ్చు అన్నది ఒక్కటే ఈ రోజు అడిగిన ప్రశ్న ఉద్దేశం తప్ప మరోటి కాదు.

నాని సినిమాలకు నాన్ థియేటర్ బిజినెస్ బాగుంది.దసరా సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. కానీ బాలీవుడ్ లో పెట్టిన ఖర్చు మాత్రం వృధా అయింది. మంచి సబ్జెక్ట్ లు ఎంచుకోవడం, మంచి సినిమాలు చేయడం వరకు నాని ని అన్ని విధాలా మెచ్చుకొవాల్సిందే. కానీ అదే సమయంలో బడ్జెట్ కంట్రోలు, థియేటర్ హక్కులు కొన్న బయ్యర్ల నష్టాల గురించి కూడా ఆలోచించాల్సిందే.