స్పార్క్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు కొత్త హీరో విక్రాంత్. మెహరీన్, రుష్కర్ థిల్లాన్, నాజర్, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది.
ఏ బ్యాకింగ్ లేని కొత్త హీరోలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే వైవిధ్య మైన కథ కధనాలే బ్యాకింగ్ గా చూసుకోవాలి. దానికి టెక్నికల్ సపోర్ట్ అనేది ఎలాగూ వస్తుంది పెట్టుబడి పెడితే. కానీ బిగువైన స్క్రీన్ ప్లే, సరైన కథ వుంటే అదే పెద్ద బ్యాకింగ్ అవుతుంది.
స్పార్క్ సినిమా ట్రయిలర్ చూస్తుంటే అలాంటి మంచి కథ, కథనాలు సమకూరినట్లే కనిపిస్తోంది. హీరో విక్రాంత్ నే కథ, కథనం సమకూర్చుకోవడం విశేషం. ట్రయిలర్ చాలా చిత్రంగా వుంది. ఒక పక్క ఇంట్రస్టింగ్ యూత్ ఫుల్ జానర్ లో నడుస్తూనే థ్రిల్లర్ టర్న్ తీసుకుంది. హీరో విక్రాంత్ హీరోయిన్లు మెహరీన్, రుష్కర్ థిల్లాన్ ల మీదే ట్రయిలర్ ఎక్కువ ఫోకస్ అయింది. ఇద్దరూ ఇప్పటికే పలు సినిమాలు చేసిన హీరోయిన్లే. వారి సరసన తొలి సినిమా అయినా కాన్ఫిడెంట్ గా చేసాడు.
సినిమాకు ఖర్చు కాస్త గట్టిగానే పెట్టినట్లు కనిపిస్తోంది. నవంబర్ 17న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఖుషీ, హాయ్ నాన్న సినిమాలో ఇప్పటికే టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరక్టర్ హేషమ్ అబ్దుల్ వాహిబ్ ఈ సినిమాకు పని చేయడం విశేషం.