ఆదిపురుష్ నైజాం @ 60 కోట్లు

ఆదిపురుష్ నైజాం బిజినెస్ క్లోజ్ అయింది. 50 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్, 10 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ కు డీల్ ను మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ క్లోజ్ చేసింది.  Advertisement ఇది…

ఆదిపురుష్ నైజాం బిజినెస్ క్లోజ్ అయింది. 50 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్, 10 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ కు డీల్ ను మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ క్లోజ్ చేసింది. 

ఇది చాలా పెద్ద డీల్ అనే చెప్పాలి. ఫిక్షన్ కాదు, మాస్ మసాలా కాదు. కేవలం ఓ భారీ మైథలాజికల్ మూవీకి ఇంత రేటు పలకడం గొప్ప విషయమే. నైజాం పంపిణీని దిల్ రాజు తీసుకుంటారు అనుకున్నారు అంతా. కానీ ఎందుకో ఆయన వెనకడుగు వేసారు.

ఇదిలా వుంటే ఆంధ్ర లోని పలు ఏరియాలు కూడా క్లోజ్ చేసారు. 55 కోట్లు నాన్ రికవరీ అడ్వాన్స్, 15 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ లెక్కన అన్ని ఏరియాలకు రేటు ఫిక్స్ చేసారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు బిజినెస్ క్లోజ్ చేసారు. వీటిలో వెస్ట్ ఉషా పిక్చర్స్, నెల్లూరు, గుంటూరు యువి, కృష్ణ జిల్లా వి-3 సంస్థలు తీసుకున్నాయి. విశాఖ మాత్రం పెండింగ్ లో వుంది. అలాగే సీడెడ్ కూడా పెండింగ్ లో వుంది.

ఆంధ్ర 70, నైజాం 60 రేషియోలో కట్ చేసారు అంటే సీడెడ్ కనీసం 25 వుంటుంది. అంటే 155 కోట్లు వెనక్కు వచ్చినట్లు. 160 కోట్లకు పీపుల్స్ మీడియా ఈ సినిమా హక్కులు తీసుకుంది.