సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేసిన టిల్లూ

డీజే టిల్లూ సినిమాలో ఓ రసవత్తరమైన సన్నివేశం ఉంది. కారులో హీరోహీరోయిన్ ఉంటారు, వాతావరణం రొమాంటిక్ గా ఉంటుంది. అప్పటికే ఇద్దరూ మందుకొట్టి ఉంటారు. హీరోయిన్ ను మెల్లగా ముగ్గులోకి దింపుతాడు హీరో. ఎన్ని…

డీజే టిల్లూ సినిమాలో ఓ రసవత్తరమైన సన్నివేశం ఉంది. కారులో హీరోహీరోయిన్ ఉంటారు, వాతావరణం రొమాంటిక్ గా ఉంటుంది. అప్పటికే ఇద్దరూ మందుకొట్టి ఉంటారు. హీరోయిన్ ను మెల్లగా ముగ్గులోకి దింపుతాడు హీరో. ఎన్ని పుట్టుమచ్చలున్నాయంటూ రొమాంటిక్ ప్రశ్న కూడా సంధిస్తాడు.

డీజే టిల్లూ సినిమాలో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన అలాంటి సీన్ ను టిల్లూ స్క్వేర్ లో కూడా రిపీట్ చేసినట్టున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అలానే అనిపిస్తోంది.

గతంలో డీజే టిల్లూ సినిమా ప్రమోషన్ కోసం నేహాశెట్టితో ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేశారో, ఇప్పుడు టిల్లూ స్క్వేర్ కోసం కూడా అనుపమ పరమేశ్వరన్ తో సేమ్ టు సేమ్ పోస్టర్ నే వదిలారు.

ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

డీజే టిల్లూలో నేహా శెట్టి అదరగొట్టింది. టిల్లూ స్క్వేర్ లో అనుపమ ఏ రేంజ్ లో హొయలొలికించిందో చూడాలి. పోస్టర్ చూస్తుంటే, అనుపమ తనలోని కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మల్లిక్ రామ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల కలిసి సంగీతం అందిస్తున్నారు.