విశాఖ మీద ఫోకస్ పెట్టిన జగన్

విశాఖని ఐటీ హబ్ గా తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి పట్టుదల మీద ఉన్నారు. సేవా రంగానికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీలో విశాఖను తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు. విశాఖ గ్రోత్…

విశాఖని ఐటీ హబ్ గా తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి పట్టుదల మీద ఉన్నారు. సేవా రంగానికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీలో విశాఖను తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు. విశాఖ గ్రోత్ ఇంజన్ ఆఫ్ ఏపీ అని మొదటి నుంచి నమ్ముతున్న ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. వాస్తవిక దృక్పధంతో సీఎం ఆలోచనలు చేస్తున్నారు అనే మేధావులు సహా ఆర్ధిక నిపుణులు అనే పరిస్థితి ఉంది.

రెడీ మేడ్ గా ఉన్న సిటీని ముందు పెట్టుకుని ఏపీని అన్ని విధాలుగా ప్రగతిపధంలో నడిపించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. దానికి తాత్కాలికంగా అడ్డంకులు ఎన్నో ఎదురైనా కూడా దీర్ఘ కాలంలో జగన్ విజన్ సక్సెస్ అవుతుంది అని అంటున్నారు.

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టిన జగన్ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్హ్సించారు. వాటి మీద రివ్యూ చేసినపుడు ఆయన అధికారులతో చెప్పినది ఒక్కటే. విశాఖను ఐటీకి చిరునామాగా చేయండి అని ఆయన ఆదేశించారు. విశాఖలో పెట్టుబడులకు ఇప్పటికే ఐటీ సంబంధిత కంపెనీలు లైన్ లో ఉన్నాయి.

వాటిని రప్పిస్తూనే మరిన్ని కొత్త పరిశ్రమలకు కూడా ఆహ్వానం పలకాలని జగన్ కోరడం వెనక విశాఖ సిటీ మీద ఫోకస్ కనిపిస్తోంది. విశాఖ అంటే ఐటీ తో పాటు ఐటీ ఆధారిత పరిశ్రమలకు కేరాఫ్ కావాలన్నది సీఎం ఆలోచనగా ఉంది.

విశాఖ సర్వీస్ సెక్టార్ కి హబ్ గా ఫ్యూచర్ లో మారుతుందన్న దృఢ విశ్వాసాన్ని సీఎం వ్యక్తం చేయడం ఈ సందర్భంగా గమనార్హం. విశాఖలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, అనేక సంస్థలను విశాఖకు రప్పించాలని ముఖ్యమంత్రి కోరడం విశేషంగా చూడాలి. విశాఖను పాలనా రాజధానిగా వైసీపీ ప్రతిపాదించింది, ఆ దిశగా మరింత ఈ సిటీకి సొబగులు అద్దేందుకు సీఎం జగన్ చేస్తున్న గొప్ప ప్రయత్నంగా అంతా చూస్తున్నారు.