భవ్యమైన వెంకన్న ఆలయం…జగన్ కే పుణ్యం

దేవుడు ఎక్కడైనా ఉంటాడు అని వేదాంతులు అంటారు. కానీ భౌతికంగా ఆ స్వామిని చూస్తేనే కానీ భక్తుడికి అసలైన తృప్తి కలగదు. అందుకే ఎన్నో ఆలయాలు ఊరూ వాడా  వెలుస్తాయి. ఇదిలా ఉంటే తిరుమల…

దేవుడు ఎక్కడైనా ఉంటాడు అని వేదాంతులు అంటారు. కానీ భౌతికంగా ఆ స్వామిని చూస్తేనే కానీ భక్తుడికి అసలైన తృప్తి కలగదు. అందుకే ఎన్నో ఆలయాలు ఊరూ వాడా  వెలుస్తాయి. ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు విశాఖలో బీచ్ రోడ్డులో ఒక భవ్యమైన వెంకన్న ఆలయం చక్కని తీరున నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయి చాలా కాలం అయినా ప్రారంభానికి నోచుకోలేదు. తెర తీయగరాదా అంటూ భక్తులు కూడా ఎదురుచూశారు. మొత్తానికి ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి. విశాఖలో వెంకన్న స్వామి వారి విగ్రహావిష్కరణ ఈ నెల 23న ఘనంగా జరగనుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా దాన్ని నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు జగన్ కి టీటీడీ వారి తరఫున ఆహ్వానం అందింది. ఇదిలా ఉండగా మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 18న ప్రారభిస్తారు. ముఖ్యమంత్రి జగన్ 23న విశాఖ వచ్చి స్వామి వారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

దాంతో వెంకన్న స్వామిని చూడాలీ అంటే తిరుపతి వెళ్లనవసరం లేకుండా విశాఖలోనే హ్యాపీగా దర్శించుకోవచ్చు. ఎట్టకేలకు ఈ ఆలయ తలుపులు తెరచుకోవడంతో ఆధ్యాత్మిక పరులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కే ఈ మహద్భాగ్యం దక్కిందని కూడా అంటున్నారు.