బంగారంలాంటి ఫోన్ పోయిందంటున్న ఐటెంభామ

ఊర్వశి రౌథేలా.. ఈ ముద్దుగుమ్మకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఐటెంసాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ బ్యూటీ. ఈ హాట్ లేడీ తన ఫోన్ పోగొట్టుకుంది. ఈ విషయాన్ని…

ఊర్వశి రౌథేలా.. ఈ ముద్దుగుమ్మకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఐటెంసాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ బ్యూటీ. ఈ హాట్ లేడీ తన ఫోన్ పోగొట్టుకుంది. ఈ విషయాన్ని వెల్లడించిన ఊర్వశి, ఎవరికైనా తన ఫోన్ దొరికితే ఇచ్చేయమని ప్రాధేయపడుతోంది.

సాధారణంగా సెలబ్రిటీలంతా ఐఫోన్ వాడతారు. అయితే ఊర్వశి వాడుతున్న ఐఫోన్ అంతకుమించి. అవును.. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఐఫోన్ అది. చాలా తక్కువ సంఖ్యలో తయారయ్యే లిమిటెడ్ వెర్షన్ ఫోన్ అది. అలాంటి ఫోన్ ను ఊర్వశి పోగొట్టుకుంది.

ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వెళ్లింది ఊర్వశి. అక్కడే ఆమె తన ఫోన్ పోగొట్టుకుంది. ఎవరికైనా తన ఫోన్ కనిపిస్తే వెంటనే సంప్రదించాలంటూ ఆమె సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తోంది. పనిలోపనిగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

ఇక్కడ సమస్య ఫోన్ తో కాదు, కావాలంటే ఊర్వశి అలాంటి ఫోన్ ఇంకోటి కొనుక్కోగలదు. కానీ అందులో డేటా, కాంటాక్ట్స్ ఎవరి చేతిలోకైనా వెళ్తాయేమో అని ఆమె భయపడుతోంది.

అయితే అది ఐఫోన్. దాన్ని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. పైగా క్లౌడ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి బ్యాకప్ చేసుకోవడం కూడా సులభమే. అయినప్పటికీ ఊర్వశి భయపడుతోంది. ఎంతైనా పర్సనల్ ఫొటోలు, వీడియోలు ఉన్న ఫోన్ కదా.. ఆమాత్రం భయం ఉంటుంది.