కన్నడ సీమ నుంచి వస్తున్న అత్యంత భారీ సినిమా కేజిఎఫ్ 2. ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు.
గ్రేట్ ఇండియా సంస్థ ద్వారా నేరుగా పంపిణీ చేస్తారన్న వార్తలు కొన్నాళ్ల క్రితం వినిపించాయి. అయితే ఇప్పుడు ఫారస్ సంస్థ హక్కులు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కేవలం కేజిఎఫ్ 2 మాత్రమే కాకుండా దీని తరువాత ప్రభాస్ తో నిర్మిస్తున్న సలార్ తో కలిపి డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే డీల్ అమౌంట్ ఎంత అన్నది తెలియరాలేదు. ప్రస్తుతానికి పెద్ద మొత్తం అడ్వాన్స్ గా అందిస్తున్నట్లు తెలుస్తోంది.
65 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చి ఆర్ఆర్ఆర్ ను కొనుగోలు చేసిన ఈ సంస్థ ఇప్పుడు అంతకన్నా పెద్ద మొత్తమే అడ్వాన్స్ గా ఇచ్చి కేజిఎఫ్ 2-సలార్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓవర్ సీస్ లో బయ్యర్లు బాగా తగ్గిపోయారు. ఫారస్ సంస్థ మాత్రమే నేరుగా, భారీ సినిమాలు కొనుగోలు చేస్తోంది.