థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీ కోసం రిపేర్లు?

ఓ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన వెంటనే కటింగ్స్ స్టార్ట్ చేయడం చాలామందికి అలవాటు. సినిమాలో కొంత భాగం ట్రిమ్ చేశామని, ఇప్పుడు మరోసారి చూడాలని విజ్ఞప్తి చేస్తుంటారు. అయితే ఏజెంట్ సినిమాకు ఆ…

ఓ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన వెంటనే కటింగ్స్ స్టార్ట్ చేయడం చాలామందికి అలవాటు. సినిమాలో కొంత భాగం ట్రిమ్ చేశామని, ఇప్పుడు మరోసారి చూడాలని విజ్ఞప్తి చేస్తుంటారు. అయితే ఏజెంట్ సినిమాకు ఆ గ్యాప్ కూడా ఇవ్వలేదు ప్రేక్షకులు. రిలీజైన మొదటి రోజు, మొదటి ఆటకే తిప్పికొట్టారు.

దీంతో ఏజెంట్ సినిమాకు ట్రిమ్మింగ్స్ చేసే అవకాశం కూడా దక్కలేదు. అయితే మేకర్స్ మాత్రం తమకున్న ఆ చివరి అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఓటీటీ కోసం ట్రిమ్ చేసిన వెర్షన్ ను సిద్ధం చేస్తున్నారట.

త్వరలోనే సోనీ లివ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు. దీని కోసం ల్యాగ్ అనిపించిన కొన్ని సన్నివేశాల్ని తొలిగించారట. స్క్రీన్ ప్లేలో కూడా కొన్ని మార్పులు చేశారట. దీంతో పాటు, డిలీట్ చేసిన కొన్ని సన్నివేశాల్ని కూడా జోడిస్తున్నారట. అలా ఏజెంట్ కొత్త వెర్షన్ ను ఓటీటీ కోసం సిద్ధం చేస్తున్నారంట.

కేవలం ఈ రిపేర్ల కోసమే ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. లేదంటే ఈ పాటికే ఈ సినిమా వచ్చి ఉండేది.

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది ఏజెంట్ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు సంబంధించి దర్శకుడు డెడ్ లైన్ అందుకోలేకపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ సాంకేతిక సమస్యలు అక్కడక్కడ సినిమాలో కనిపించాయి కూడా. వాటన్నింటినీ ఓటీటీ రిలీజ్ రిలీజ్ కోసం సరిచేస్తున్నారట. ఈ నెల్లోనే ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది.