దేవుడు కరుణిస్తే త్వరలోనే పెళ్లి అంటున్న హీరో

దగ్గుబాటి అభిరామ్.. ఇతగాడికి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లోకి రాకముందు నుంచే శ్రీరెడ్డి ఇష్యూతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అహింస సినిమాతో హీరో అయ్యాడు. ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు.…

దగ్గుబాటి అభిరామ్.. ఇతగాడికి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లోకి రాకముందు నుంచే శ్రీరెడ్డి ఇష్యూతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అహింస సినిమాతో హీరో అయ్యాడు. ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే, దేవుడు కరుణిస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అభిరామ్. అయితే ఆ విషయాన్ని పూర్తిగా తన తల్లిదండ్రులకే అప్పగించానని క్లారిటీ ఇస్తున్నాడు. వాళ్లు ఏది కరెక్ట్ అని భావిస్తే, వాళ్ల నిర్ణయాన్ని తను ఫాలో అవుతాడట.

ఇలా తన మనసులో ఎవ్వరూ లేరని, తను ఎవ్వరితో ప్రేమలో లేననే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు అభిరామ్. సినిమాల్లోకి రాకముందు శ్రీరెడ్డి ఇష్యూతో పాపులర్ అయ్యాడు ఈ హీరో. ఆమెతో చనువుగా దిగిన ఫొటోలు బయటకొచ్చిన తర్వాత ఇతడి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయాడు అభిరామ్.

ఆ తర్వాత అహింస సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చిన ఈ హీరో, మళ్లీ ఇన్నాళ్లకు మీడియా ముందుకొచ్చాడు. గతంలో కంటే ఇప్పుడు తను మరింత బాధ్యతాయుతంగా ఉంటున్నానని చెప్పుకొచ్చిన ఈ హీరో, సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్న విషయాన్ని స్పష్టం చేశాడు.

సినిమాలకు సంబంధించి దర్శకుడు తేజ తనకు చాలా నేర్పించాడని, అయితే తను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని, ఆ లెర్నింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత నెక్ట్స్ సినిమా ప్రకటిస్తానని తెలిపాడు. ప్రస్తుతం తన వద్ద 10-12 స్క్రిప్టులు పెండింగ్ లో ఉన్నాయని, త్వరలోనే తన టీమ్ వాటిని స్క్రూటినీ చేస్తుందని అంటున్నాడు.