వారం రోజులకే దుకాణం సర్దేసిన ల్యాండ్ మార్క్ చిత్రం

జపాన్.. హీరో కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రం. అతడి కెరీర్ లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ ఇది. అందుకే ఆచితూచి ఈ సినిమా కథను సెలక్ట్ చేసుకున్నాడు కార్తి. మూవీపై బాగా…

జపాన్.. హీరో కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రం. అతడి కెరీర్ లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ ఇది. అందుకే ఆచితూచి ఈ సినిమా కథను సెలక్ట్ చేసుకున్నాడు కార్తి. మూవీపై బాగా హోం వర్క్ చేశాడు. అంచనాలు పెంచడంలో కూడా బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే ఆ అంచనాలను జపాన్ అందుకోలేకపోయింది.

దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ మూవీతో పాటు వచ్చిన జిగర్తాండా డబుల్ ఎక్స్ ఊపందుకోవడంతో, జపాన్ సినిమాకు ఆక్యుపెన్సీ పూర్తిస్థాయిలో పడిపోయింది. దీంతో విడుదలైన వారం రోజులకే ఈ సినిమాను మెల్లమెల్లగా చాలా థియేటర్ల నుంచి తప్పించడం మొదలుపెట్టారు. 

కేవలం దీపావళి, ఆ మరుసటి రోజు మాత్రమే జపాన్ సినిమా తమిళనాట మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా పూర్తిస్థాయిలో చతికిలపడింది. అలా దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా నాగుల చవితి నాటికి దుకాణం సర్దేసింది.

ఇదొక హయస్ట్ థ్రిల్లర్. చాలా సీరియస్ కథ. దీన్ని అంతే సీరియస్ గా చెబితే బాగుండేది. కానీ సింపుల్ గా, సరదాగా చెప్పాలనుకున్నారు. ఈ నిర్ణయమే జపాన్ రిజల్ట్ తేడా కొట్టడానికి ప్రధాన కారణం. ఈ కారణంగానే ప్రేక్షకుడు, కార్తి క్యారెక్టర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోయాడు. 

రాజు మురుగన్ లాంటి దర్శకుడి నుంచి ఇలాంటి నెరేషన్ ను ఊహించలేకపోయారు ప్రేక్షకులు. దీనికితోడు మిగతా పాత్రలేవీ పెద్దగా క్లిక్ అవ్వకపోవడం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం నాసిరకంగా ఉండడం సినిమాను దెబ్బతీశాయి.