నాకు రూ.20 కోట్లు ఆఫ‌ర్‌..అయినా డోంట్ కేర్‌!

చెన్నూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి బాల్క‌సుమ‌న్‌పై మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తే బాల్క సుమ‌న్ రూ.20 కోట్లు ఆఫ‌ర్ చేశార‌ని కాంగ్రెస్ నాయ‌కుడైన…

చెన్నూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి బాల్క‌సుమ‌న్‌పై మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తే బాల్క సుమ‌న్ రూ.20 కోట్లు ఆఫ‌ర్ చేశార‌ని కాంగ్రెస్ నాయ‌కుడైన ఓదేలు ఆరోపించ‌డం రాజ‌కీయ దుమారం రేపుతోంది. రూ.100 కోట్లు ఇచ్చినా తాను కాంగ్రెస్ అభ్య‌ర్థి వివేక్‌కు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయడం విశేషం.

మొద‌ట్లో చెన్నూరు టికెట్‌ను బీఆర్ఎస్ త‌ర‌పున ఓదేలు ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఓదేలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే అక్క‌డ కూడా ఆయ‌న‌కు నిరాశే ఎదురైంది. మాజీ ఎంపీ వివేక్ చేర‌డంతో ఓదేలుకు కాంగ్రెస్ స‌ర్ది చెప్పింది. చివ‌రికి వివేక్ గెలుపు బాధ్య‌త‌ల్ని ఓదేలు మీద వేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో బాల్క సుమ‌న్‌పై ఓదేలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. బాల్క సుమ‌న్‌లా తాను బానిస కాద‌ని ఘాటు వ్యాఖ్య చేశారు. 

బాల్క సుమ‌న్‌కు ఓడిపోతామ‌నే భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. త‌న‌ను ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసినా లొంగిపోయే వ్య‌క్తిత్వం కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రానున్న ఎన్నిక‌ల్లో చెన్నూరులో ఓడిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఓదేలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌పై బాల్క సుమ‌న్ ఎలా స్పందిస్తారో మ‌రి!