ప్రతిపక్షాల నోటికి ఆ మాట రాదెందుకు..?

విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, మా మనోభావాలతో ఆడుకుంటున్నారు, సీఎం జగనే దీనికి కారణం, ప్రభుత్వానిదే బాధ్యత అంటూ రచ్చ రచ్చ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.  Advertisement ఎవరికెంత మైలేజీ వస్తోందనే విషయాన్ని లెక్కేసుకుని మరీ పరామర్శ…

విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, మా మనోభావాలతో ఆడుకుంటున్నారు, సీఎం జగనే దీనికి కారణం, ప్రభుత్వానిదే బాధ్యత అంటూ రచ్చ రచ్చ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. 

ఎవరికెంత మైలేజీ వస్తోందనే విషయాన్ని లెక్కేసుకుని మరీ పరామర్శ యాత్రలు, ధర్మ పోరాట దీక్షలంటూ అగ్గి రాజేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ వేటికవే పోటీ పడుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో హిందూ మతం తరపున ఊగిపోతూ ఉపన్యాసాలిచ్చేవారికి లెక్కే లేదు. నుదిటిన బొట్టు పెట్టుకుని ఎంతమంది ఎన్ని రకాల విన్యాసాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అంతా బాగానే ఉంది.

హిందూ మతంపై వీరికున్న ప్రేమ, హిందువుల మనోభావాలపై వీరికున్న గౌరవం బాగానే ఉన్నాయి. మరి విగ్రహాల ధ్వంస రచన ఆపేందుకు ఎవరెవరు ఏ మేరకు కృషి చేస్తున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

చంద్రబాబు కానీ, సోము వీర్రాజు కానీ, పవన్ కల్యాణ్ కానీ.. విధ్వంసం ఆపండి అంటూ ఒక్క బహిరంగ స్టేట్ మెంట్ అయినా ఎందుకు ఇవ్వలేదు. 

విధ్వంస రచన చేస్తోంది ఎవరో ఎవరికీ తెలియదు, వాటి వెనక రాజకీయ పార్టీలున్నాయా, నిజంగానే మతాన్ని కించపరిచే కుట్ర జరుగుతోందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అలాంటప్పుడు కనీసం ప్రజలకైనా ఓ సందేశం ఇవ్వొచ్చు కదా.

తెలిసో తెలియకో ఎవరూ విగ్రహాల జోలికి వెళ్లొద్దు, అలా ఎవరైనా చేశారని తెలిస్తే వాడి తాట తీయండి అని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. వీరావేశం వీర్రాజు.. తమ కర్ర సేవకుల్ని విగ్రహాల విధ్వంసకుల సంగతి తేల్చండి అంటూ ఎందుకు పురమాయించలేదు. 

బోడి డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్.. ఇకనైనా ఇలాంటి పనులు ఆపాలంటూ కనీసం తన పార్టీ తరపున అయినా ఓ ప్రెస్ నోట్ విడుదల చేయొచ్చు కదా.

ఆ మాట ఎవరి నోటా రావడంలేదు. తప్పు చేస్తున్నారు, ఆపండి అని మాత్రం చెప్పడంలేదు. తప్పులు జరుగుతున్నాయి, తేల్చుకుంటామంటూ ప్రజల్ని రెచ్చగొట్టడానికి మాత్రం వీరిలో ఏ ఒక్కరూ వెనకాడ్డంలేదు.

తర్కానికి నిలవని ప్రతిపక్షాల వాదన..

విగ్రహాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని అంటూనే.. సీఎం జగన్ క్రిస్టియన్ కావడం వల్లే హిందూ విగ్రహాలపై ఆయనే కావాలని దాడులు చేయిస్తున్నారని బీజేపీ వితండవాదానికి దిగింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా.. నాలుగు మంచి పనులు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తారు. 

అలాంటప్పుడు జగన్ ఇలాంటి తప్పులు చేసి తన పదవి కిందకు నీళ్లెందుకు తెచ్చుకుంటారు? విగ్రహాల ధ్వంసంతో ఏ ఉపయోగం ఉంటుందని వైసీపీ నేతలు ఈ ఘటనలకు వత్తాసు పలుకుతారు? ఆమాత్రం లాజిక్ లేకుండా విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సీఎం జగన్ మతాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిలో పలుచన అయ్యాయి.

ప్రతి రోజూ ఏదో ఒక మారుమూల ప్రాంతంలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసం వెనక ఎవరున్నారనే విషయం ఈపాటికే ప్రజలకు అర్థమవుతోంది. పోలీసుల నేర పరిశోధనలో… అసలు విషయాలు బయటపడితే ప్రతిపక్షాల నోటికి అప్పుడు తాళం పడుతుంది. 

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి