హీరో నాగ్ చైతన్య చాలా ప్రాక్టికల్ గా వుంటాడు. అలాగే ఆలోచిస్తాడు కూడా. అందుకే తన పక్కన హీరోయిన్ గా సమంత ను తీసుకుందా అంటే వెంటనే నో చెప్పేసాడు.
మొన్నటికి మొన్నే మజిలీలో కలిసి నటించాం కదా, మళ్లీ ఇఫ్పట్లో వద్దు, మరొకర్ని ఆలోచించండి అంటూ క్లారిటీ ఇచ్చేసాడు.ఇదంతా దిల్ రాజు-విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'థాంక్యూ' సినిమా విషయంలోనే.
జస్ట్ ఓ మామూలు కుర్రాడిగా, మహేష్ బాబు సినిమాల విడుదల టైమ్ లో థియేటర్ల వద్ద కటౌట్ కట్టే స్థాయి నుంచి విదేశాల్లో బిజినెస్ మాగ్నెట్ గా ఎదిగిన కుర్రాడు తన ఎదుగుదలకు కారణమైన వారందరికీ థాంక్స్ ఎలా చెప్పాడు అన్న లైన్ తో తయారవుతున్న సినిమా ఇది.
ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా కాస్త డెప్త్ వుంది. ఎవరు పడితే వారు సూట్ కారు. అందుకే సమంత అయితే బెటరేమో అనుకున్నారు టీమ్ అంతా. కానీ చైతన్య మాత్రం వెంటనే నో చెప్పేసాడు. దాంతో ఇప్పుడు హీరోయిన్ వేట సాగుతోంది. ఇంకా ఇప్పటి వరకు అయితే ఎవన్నీ ఫిక్స్ కాలేదు.