కేసీఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఎపిసోడ్లో కిడ్నాప్‌నకు గురైన ముగ్గురు వ్యక్తులు క్షేమంగా ఉండడంతో తెలంగాణ సర్కార్ ఊపిరి పీల్చుకుంది.
కాగా ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో 8 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ తమ్ముడు చంద్రహాస్ ఉన్నట్టు సమాచారం.
నిన్న రాత్రి సీఎం కేసీఆర్ సోదరి సమీప బంధువులైన ప్రవీణ్, నవీన్, సునీల్‌ను సినీఫక్కీలో దుండగులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.
హఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన 50 ఎకరాల భూమికి సంబంధించి గత కొంత కాలంగా మాజీ మంత్రి అఖిలప్రియ కుటుంబానికి, కిడ్నాప్‌నకు గురైన ప్రవీణ్ కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రవీణ్‌తో పాటు ఆయన సోదరుల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. ఈ కిడ్నాప్‌నకు సంబంధించి ప్రధానంగా మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, ఆయన తమ్ముడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన సోదరుడైన లాయర్ చంద్రహాస్ పోలీసుల అదుపులో ఉన్నారనే సమాచారం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కిడ్నాప్‌నకు గురైన ప్రవీణ్ సోదరుల సమీప బంధువు ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ ఏ క్షణమైనా తమవాళ్లు ఇంటికి చేరవచ్చన్నారు.
కిడ్నాప్ సమాచారం అందిన వెంటనే తెలంగాణ పోలీసులు స్పందించారన్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు. దేశం లోనే తెలంగాణ పోలీస్ బెస్ట్ అని మరోసారి రుజువైందని ఆయన చెప్పుకొచ్చారు.
రాత్రంతా తమ కుటుంబం టెన్షన్‌కు గురైందన్నారు. ఇటు పోలీసులు, అటు మీడియా … అన్ని వైపుల నుంచి ఒత్తిడి వల్లే తమ వాళ్లు సేఫ్ అయ్యారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి వుంది.