ఏకంగా సహజీవనం స్టార్ట్ చేసిన యంగ్ హీరో

టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అతడు. ఈమధ్య కాలంలో సరైన హిట్ లేనప్పటికీ, సక్సెస్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మినిమం గ్యాప్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తూనే…

టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అతడు. ఈమధ్య కాలంలో సరైన హిట్ లేనప్పటికీ, సక్సెస్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మినిమం గ్యాప్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు.

ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆ కుర్ర హీరో, ఇప్పుడు నిజంగానే రియల్ లైఫ్ లో అలాంటి 'ప్రేమ'ను పొందుతున్నాడు. ఓవైపు చాలామంది హీరోలు డేటింగ్ చేస్తుంటే, ఈ యంగ్ హీరో మాత్రం ఏకంగా సహజీవనం షురూ చేశాడు.

అతడికి ఇష్టమైన హాలిడే స్పాట్ గోవా. అందుకే ఏకంగా గోవాలోనే సహజీవనం మొదలుపెట్టాడు. అమ్మాయిది కూడా తన ఊరికి దగ్గర్లోనే మరో సిటీ కావడంతో ఇద్దరి అభిప్రాయాలు బాగా సింక్ అయ్యాయి. ప్రస్తుతానికైతే ఇద్దరూ తమ ప్రైవేట్ లైఫ్ ను గుంభనంగా గడిపేస్తున్నారు. అయితే ఈ కుర్రాడు తను చేస్తున్న సహజీవనాన్ని అఫీషియల్ గా పెళ్లిగా మారుస్తాడా లేక కొన్ని రోజుల తర్వాత 'కొత్తదనం' కోరుకుంటాడా అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మామూలుగానే ఈ హీరో మంచి మందు బాబు. కానీ ఇప్పుడు మందు కంటే తన ప్రేయసితోనే గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఈ నటుడు, మూడో కంటికి కనిపించకుండా వారానికి కనీసం 2సార్లు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లిపోతున్నాడు.

ఇంతకీ ఇప్పుడీ విషయం ఎలా బయటపడిందో తెలుసా? తన కొత్త సినిమాకు డబ్బింగ్ ఎగ్గొట్టాడు ఈ హీరో, ప్రమోషనల్ వీడియో షూటింగ్స్ కు కూడా హాజరవ్వడం లేదు. విషయం ఏంటని ఆరా తీస్తే 'గోవా మేటర్' బయటపడింది. మరో రెండేళ్లు పెళ్లి చేసుకోనంటూ ఆమధ్య ప్రకటించింది కూడా బహుశా ఇందుకేనేమో. ఈ లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఎన్నాళ్లు నడుస్తుందో చూడాలి.