విధి రాతను నమ్ముతానంటున్న హీరోయిన్

విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరాటం కాన్సెప్ట్ తో తెరకెక్కింది రాధేశ్యామ్. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతకాల గురించి చర్చించారు. దీనిపై ఇప్పటికే స్పందించిన పూజాహెగ్డే, తను జాతకాల్ని నమ్ముతానని స్పష్టం…

విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరాటం కాన్సెప్ట్ తో తెరకెక్కింది రాధేశ్యామ్. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతకాల గురించి చర్చించారు. దీనిపై ఇప్పటికే స్పందించిన పూజాహెగ్డే, తను జాతకాల్ని నమ్ముతానని స్పష్టం చేసింది. ఇప్పుడు విధిరాతపై కూడా స్పందించింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లోని తను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి విధి రాతే కారణం అంటోంది.

“జీవితంలో ఏది జరిగినా దానికో కారణం ఉంటుందని నేను నమ్ముతాను. లేకపోతే నేను హీరోయిన్ అవ్వడం ఏంటి. విద్యాధిక కుటుంబం నుంచి నేను ఇటువైపు రావడం ఏంటి. విధి నా చేయి పట్టుకొని ఇటు వైపు నడిపించిందని నేను నమ్ముతాను. మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా నేను నిలబడడం వెనక కారణం విధి అని నేను నమ్ముతాను. ఇప్పుడు నేనున్న పొజిషన్ కు కూడా విధి కారణమని నమ్ముతాను.”

ఇలా డెస్టినీపై స్పందించింది పూజా హెగ్డే. ప్రస్తుతం తనకు ఫిమేల్ ఓరియంటెడ్ కథలతో ఆఫర్లు వస్తున్నాయంటే.. తను మంచి నటిగా ఎదిగానని చెప్పడానికి అదే ఉదాహరణ అంటోంది.

“ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఇండస్ట్రీలో ఒకరిద్దరు మినహా ఎలాంటి సపోర్ట్ లేదు. నేను పెద్దగా పోగొట్టుకున్నది కూడా ఏం లేదు. ఇక్కడి వరకు వచ్చానంటే దానికి కారణం నాపై నాకున్న నమ్మకం, విధి రాత మాత్రమే. అందుకే మ్యాగ్జిమమ్ కష్టపడాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఇబ్బంది పెట్టే ఏ భయాన్ని, అపనమ్మకాన్ని దరిచేరనీయను.”

రాధేశ్యామ్ లో తను పోషించిన ప్రేరణ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్న పూజాహెగ్డే.. ఈ ఏడాది మొత్తం బిజీగా ఉండబోతున్నానని ప్రకటించింది. అంతేకాకుండా, వచ్చే ఏడాదికి కూడా కాల్షీట్లు కేటాయించినట్టు తెలిపింది.