విశ్వాసులు – కార్యకర్తలు

క్రీ.శ. 1600, డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టింది. క్రైస్తవమతం ఈ నేలపైకి వచ్చి ఇది 421వ సంవత్సరం. Advertisement అప్పటి వరకూ గుళ్ళకు, బళ్ళకు, ఊళ్ళకు దూరంగా ఉంచబడ్డ జనం…

క్రీ.శ. 1600, డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టింది. క్రైస్తవమతం ఈ నేలపైకి వచ్చి ఇది 421వ సంవత్సరం.

అప్పటి వరకూ గుళ్ళకు, బళ్ళకు, ఊళ్ళకు దూరంగా ఉంచబడ్డ జనం మెల్లగా చర్చిల్లోకి, బళ్ళలోకి వెళ్ళారు. తమ ఆవాసాలను ఊళ్ళుగా మార్చేసుకున్నారు. ఈ పరిణామక్రమం అంత తేలిగ్గా జరగలేదు.

ఈ దేశంలో అప్పటివరకూ గుళ్ళలోకి రానివ్వని కులాలవారే తెల్లదొరల పంచనచేరి, మతమార్పిడులు ప్రోత్సహించి చర్చిలు కట్టించారు. బైబిలు కాపీలు పంచిపెట్టారు.

ఈ దేశంలో జంధ్యానికి సిలువ తగిలించుకుని క్రైస్తవ మత ప్రచారం చేసిన రాబర్ట్ డి నోబిలి వంటివారు మున్ముందుగా బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు. మొదట మతమార్పిడి చేసుకున్నది అన్ని దేవాలయాల్లోకి ప్రవేశార్హత ఉన్నవారే. అన్ని పూజలకు అర్హులే. ఆ తర్వాతే మిగతవారు.

స్వాతంత్య్ర పోరాటం కూడా స్వయంపాలన కోసమే జరిగింది కానీ, మతమార్పిడులుకు వ్యతిరేకంగా కాదు.

ఝాన్సీలక్ష్మిభాయి నేతృత్వంలో జరిగిన మొదటి తిరుగుబాటు కానీ, మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన సత్యాగ్రహ పోరాటం కానీ మత మార్పిడులకు వ్యతిరేకంగా కాదు.

కానీ, విచిత్రంగా ఇప్పుడు మతమార్పిడులు, హిందూమత సంరక్షణ ఈ దేశంలో ఎజెండాగా నిలిచింది. ఈ ఎజెండా ఎవరిది!? హిందూ ధర్మ విశ్వాసులదా!? హిందూ మత కార్యకర్తలదా!?

హిందూ ధర్మ విశ్వాసులు భయపడాల్సింది లేదు. ఎందుకంటే భారత దేశంలో ఏ మత విశ్వాసం అయినా హిందూ ధర్మ విశ్వాసంలోని అనేక అంశాలు పాటిస్తోంది. కొబ్బరికాయలు కొట్టడం, తలనీలాలు ఇవ్వడం, చేతులెత్తి మొక్కడం, సాష్టాంగ నమస్కారం చేయడం… ఇంకా ఇలాంటివి చాలా ఈ దేశంలోని ఇతర మతాలు ఆచరిస్తూనే ఉన్నాయి.

పితా, పుత్ర అంటూ వచ్చే పాశ్చాత్య క్రైస్తవమతం ఈ దేశంలోని చేతులు జోడించి మొక్కే హిందు ఆచారాన్ని అనుసరిస్తోంది. (కొన్ని మినహాయింపులు ఉండొచ్చు)

భగవద్గీత పోటీల్లో గెలిచే ముస్లింలు, తలనీలాలు ఇచ్చే క్రైస్తవులు ఈ దేశంలో ఉన్నారు. పెళ్ళిళ్ళలో, ఇతర శుభకార్యాలలో అక్షితలు వాడే హిందూయేతర మతాల ప్రజలున్నారు. అందువల్ల హిందూ ధర్మానికి, హిందూ జీవన విధానానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వారంతా బాగున్నారు. బాగుంటారు. హిందూ ధర్మం కూడా బాగుంటుంది, వర్ధిల్లుతుంది.

కానీ, హిందూ మత కార్యకర్తలకు మాత్రమే ఏదో ప్రమాదం కనిపిస్తున్నట్టుంది… అందుకేనెమో దేవస్థానాలు పాక్షికంగా ధ్వంసం అవుతున్నాయి. భగవంతుల విగ్రహాల తలలు తెగుతున్నాయి. చేతులు విరుగుతున్నాయి.

ఆలోచిస్తే, ఇది విశ్వాసులు సమస్య కాదు, కార్యకర్తల సమస్యే అని అనుమానం కలుగుతోంది.

దేశం యావత్తూ క్రైస్తవ పాలకుల ఆధీనంలో వందల సంవత్సరాల పాటు ఉన్నప్పుడు లేని ప్రమాదం ఇప్పుడెందుకు వస్తుంది!?

Facebook post by Gopi Dara

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు