ప్రయోగంతో పాటు ప్రతిష్టాత్మకం కూడా..!

కార్తికేయ-2 సక్సెస్ తో నిఖిల్ రేంజ్ పెరిగింది. అతడి సినిమాల స్థాయి కూడా పెరిగింది. ప్రస్తుతం స్పై అనే పాన్ ఇండియా సినిమాను విడుదలకు సిద్ధం చేసిన ఈ హీరో, ఇప్పుడు ఏకంగా ఓ…

కార్తికేయ-2 సక్సెస్ తో నిఖిల్ రేంజ్ పెరిగింది. అతడి సినిమాల స్థాయి కూడా పెరిగింది. ప్రస్తుతం స్పై అనే పాన్ ఇండియా సినిమాను విడుదలకు సిద్ధం చేసిన ఈ హీరో, ఇప్పుడు ఏకంగా ఓ హిస్టారికల్ వార్ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

నిఖిల్ కొత్త సినిమా పేరు స్వయంభూ. స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినది అని అర్థం. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో పొడుగాటి జుట్టుతో, ఒక చేతిలో బల్లెం, మరో చేత్తో డాలు పట్టుకున్న నిఖిల్ ను చూపించారు. నిఖిల్ గెటప్, మేకోవర్ బాగున్నాయి.

నిఖిల్ కెరీర్ లో 20వ చిత్రంగా వస్తున్న స్వయంభూ, అతడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. దీంతో ఈ ప్రాజెక్టు నిఖిల్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. పైగా కాన్సెప్ట్ పరంగా ఇది అతడికి ప్రయోగాత్మకం కూడా. ఆగస్ట్ నుంచి ఈ సినిమా పట్టాలపైకి వస్తుంది.

టెక్నికల్ గా కూడా మంచి సపోర్ట్ దొరికింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, కేజీఎఫ్ ఫేమ్ మ్యూజిక్ డైరక్టర్ రవి బస్రూర్, ఈ ప్రాజెక్టుకు వర్క్ చేయబోతున్నారు. పిక్సెల్ స్టుడియోస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకుడు.

కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నిఖిల్ కు మంచి సినిమాలు పడుతున్నాయి. మొన్ననే రామ్ చరణ్ నిర్మాతగా ది ఇండియా హౌజ్ అనే ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. ఇప్పుడిలా స్వయంభూ అనే పీరియాడిక్ మూవీని ప్రకటించారు.