సెక్స్ కు నిరాకరణ.. భార్యను చంపేసిన భర్త

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. శృంగారానికి ఒప్పుకోలేదనే కారణంతో కట్టుకున్న భార్యను చంపేశాడు ఓ కిరాకత భర్త. నెల రోజుల కిందటే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. శారీరకంగా శృంగారానికి విముఖత చూపించే టైమ్ అది.…

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. శృంగారానికి ఒప్పుకోలేదనే కారణంతో కట్టుకున్న భార్యను చంపేశాడు ఓ కిరాకత భర్త. నెల రోజుల కిందటే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. శారీరకంగా శృంగారానికి విముఖత చూపించే టైమ్ అది. అలాంటి టైమ్ లో భార్యను బలవంతం పెట్టాడు. ఒప్పుకోకపోవడంతో ఏకంగా చంపేశాడు.

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తరుణ్, ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బతుకుతెరువు కోసం భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. ఐఎస్ సదన్ లోని ఖాజా బాగ్ లో ఉంటూ, ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

వీళ్లకు రెండేళ్ల కొడుకున్నాడు. ఏప్రిల్ 16న ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఝాన్సీ. మే 20 రాత్రి తరుణ్, ఝాన్సీ దగ్గరకు వచ్చాడు. శృంగారానికి బలవంతం చేశాడు. అయితే తను నీరసంగా ఉన్నానని, అలసిపోయానని, అందుకు నిరాకరించింది ఝాన్సీ. కానీ తరుణ్ వదల్లేదు.

బలవంతంగా ఝాన్సీతో శృంగారంతో పాల్గొనడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బలవంతంగా తన చేతితో నోరు మూశాడు. అదే టైమ్ లో ముక్కు కూడా మూసుకుపోవడంతో ఝాన్సీకి ఊపిరాడలేదు. క్షణాల్లోనే ఆమె అచేతనంగా మారింది. భయపడిన తరుణ్, బంధువులకు సమాచారం అందించాడు. హాస్పిటల్ కు తీసుకెళ్తే, అప్పటికే ఝాన్సీ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

జరిగిన ఘటనపై తరుణ్ నోరు విప్పలేదు. కానీ ఝాన్సీ తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తరుణ్ ను తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో జరిగిందంతా కక్కేశాడు తరుణ్. పోస్టుమార్టం రిపోర్టులో కూడా అదే విషయం బయటపడ్డంతో తరుణ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.