కృష్ణ ఎల్లా తెలుగువారు కాదా?

కరోనా టీకా అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుందని, అయితే ఈ పాలిటిక్స్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. ''…‘సైన్స్‌యే నాకు ఆక్సిజన్,…

కరోనా టీకా అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుందని, అయితే ఈ పాలిటిక్స్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. ''…‘సైన్స్‌యే నాకు ఆక్సిజన్, నేను తమిళనాడుకు చెందిన ఓ రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి వ్యాపారంలో అసలేమాత్రం ప్రవేశం లేదు..'' అని కూడా ఆయన అన్నారు.

ఇదే చిత్రంగా వుంది. తన కంపెనీ గురించి చెప్పుకోవచ్చు. తమ అనుభవం గురించి వివరించవచ్చు. తమ సత్తా గురించి చాటుకోవచ్చు. కానీ మధ్యలో ఈ తమిళనాడు, రైతు కుటుంబం సంగతేమిటో? భారత్ బయోటెక్ ఎండీ కి తెలుగు మీడియా టైకూన్ కు సన్నిహిత బాంధవ్యాలు వున్నాయని తెలుసు. 

తెలుగువారు గతంలో ఇటు కర్ణాటక బోర్డర్ కు, అటు కోయంబత్తూరు వైపు నకు వలస వెళ్లి సెటిలయ్యారు. ఎక్కడ సెటిల్ అయినా తెలుగువారు తెలుగువారే. ఆ విధంగా కృష్ణ ఎల్లా కూడా తెలుగువారే. పైగా వెంకయ్యనాయుడు లాంటి పెద్దలతో మంచి సంబంధాలు వున్నవారు. 

గతంలో వెంకయ్యనాయుడు సమక్షంలోనే టీకా ఒప్పందాలు జరిగాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మొన్నటికి మొన్న వెంకయ్య నాయుడు వచ్చినపుడు కూడా కృష్ణ ఎల్లా ప్రత్యేకంగా కలిసారు. జాతీయ స్థాయిలో వస్తున్న విమర్శ ఏమిటి? మూడో విడత ట్రయిల్స్ ఇంకా పూర్తి కాకుండానే కోవాక్సీన్ కు అనుమతి ఇచ్చారన్నదే విమర్శ. అంతకు మించి ఏమీ లేదు. 

మరి తనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేదన్నట్లు, తను తమిళనాడు రైతుకుటుంబానికి చెందిన వ్యక్తిని కృష్ణ ఎల్లా చెప్పుకోవడం వెనుక వైనమేమిటో? అంటె తన వ్యాక్సీన్ కు అనుమతి కోసం తెలుగు టైకూన్ లు, రాజకీయ నాయకులు ఎవ్వరూ తెరవెనుక కృషి చేయలేదని చెప్పడం కోసమా? మరి తెలుగు నాట ఆ రెండు పత్రికలు గత కొన్ని నెలలుగా కోవాక్సీన్ ను ఆకాశానికి ఎత్తుతూ వార్తలు ఎందుకు ప్రచురిస్తున్నట్లో?

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు